actor Anjali sing a song for her upcoming film

Actor anjali sing a song for her upcoming film

Anjali, Anjali sing a song, chitrangada, yarni

Actor Anjali sing a song Dong dong for her Chitrangada cinema. Piila jamindar fame ashok directing this film.

చివరకు అంజలి కూడా ఆ పని చేసింది

Posted: 03/10/2016 10:23 AM IST
Actor anjali sing a song for her upcoming film

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగింటి ఆడపడుచుగా, సీతమ్మ వాకిట్లో సీతగా అలరించిన అంజలి కెరీర్ లో దూసుకుపోతోంది. గీతాంజలిలాంటి సినిమాలో అందరి చేత మంచి మార్కులు కొట్టేసిన అంజలి మంచి ఫాంలో ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా అంజలి సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు కూడా అందరిలాగా తన టాలెంట్ ను చూయించింది. తాజాగా తెలుగు, తమిళ భాషలో విడుదలకానున్న తన సినిమా కోసం ఓ పాట పాడింది. తెలుగులో చిత్రాంగద, తమిళంలో యార్నీ పేరుతో రిలీజ్ కు సిద్దమవుతోంది.

పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ సినిమాకు దర్శకత్వంవహిస్తున్నారు. డ...డ..డాంగ్...డాంగ్.. డంగ్ చుక్.. డంగ్ చుక్... యాపిల్ ఫోన్.. యాపిల్ రేటుకు వస్తే.. ఆషాడం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే అంటూ అంజలి ఆలపించిన పాటను సెల్వగణేషన్, స్వామినాథన్ సంగీత దర్శకత్వంలో ఇటీవల రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఏదిఏమైనా, ఇలా హీరోయిన్స్ వాళ్ల గొంతుతో వాళ్లే డబ్బింగ్ చెప్పుకోలేని ఈరోజుల్లో అంజలి ఏకంగా పాట పాడటం చూసినవాళ్లంతా, అంజలిని ప్రశంసలతో ముంచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali  Anjali sing a song  chitrangada  yarni  

Other Articles