NTR sung a song for Power Star

Ntr sung a song for power star

NTR, Power Star, Puneet Rajkumar, Sanalwood, NTRs latest song, NTR fans

Young Tiger NTR sung a song for Power Star Puneet Raj kumar film Khakravuh. Gelaya Gelaya song released by anand music.

పవర్ స్టార్ కోసం ఎన్టీఆర్ పాడిన పాట హిట్

Posted: 03/09/2016 11:45 AM IST
Ntr sung a song for power star

తెలుగు సినీ రంగంలో యంగ్ టైగర్ గా, నందమూరి ఫ్యామిలీలో భారీ క్రేజ్ ఉన్న హీరోగా ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటనలో, డ్యాన్సింగ్ లో ఇలా అన్ని రంగాల్లోనూ ఎన్టీఆర్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. అయితే తాజగా ఆయన పాటలు కూడా పాడుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా పాటపాడి అందరిని అలరించారు. అయితే తాజాగా మరోసారి తన సింగింగ్ ట్యాలెంట్ ను చూపించారు. కాగా ఈసారి పవర్ స్టార్ కోసం పాటపాడట విశేషం. పవర్ స్టార్ అంటే మన తెలుగు సినిమా పవర్ స్టార్ కాదులెండి.. కన్నడ పరిశ్రమలో ఉన్న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.

కన్నడ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ తాజా చిత్రం చిక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ పాటపాడారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ సినిమా సాటను యు ట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటకు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గెలయో గెలయో అంటూ సాగే ఈ హుషారైన పాటతో ఎన్టీఆర్ ఈ ఏడాది మరో హిట్ కొట్టాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Power Star  Puneet Rajkumar  Sanalwood  NTRs latest song  NTR fans  

Other Articles