Surya | 24 the movie | Teaser | Samantha | Nithya menon

Surya 24 official teaser

24 Official Teaser, 24 Teaser, 24 Tamil Teaser, 24 Telugu Teaser, 24 movie posters, 24 movie stills, Surya 24 teaser, Surya movie stills, Surya teaser, Surya

Surya 24 Official Teaser: Tamil Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha, Nithya menon heroines, AR Rahaman music.

బాబోయ్... సూర్య ‘24’ టీజర్ సిరిగిపోయింది

Posted: 03/04/2016 06:43 PM IST
Surya 24 official teaser

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘24’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా ఎలా వుండబోతుందనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తమిళ, తెలుగు టీజర్లను విడుదల చేసారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈ టీజర్ కు ప్రస్తుతం భారీ ప్రశంసలు వస్తున్నాయి.

ఇందులో సూర్య 3 విభిన్న గెటప్ లలో కనిపిస్తున్నాడు. టీజర్ అంతా కూడా చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. అసలు సినిమా కథ ఎలా వుండబోతుందోనని ఊహించడానికి కూడా వీలులేకుండా చాలా కొత్తగా వుంది. శాస్త్రవేత్త, బందిపోటు, ఫైలెట్ అంటూ మూడు పాత్రలలో కనిపిస్తున్నాడు. శాస్త్రవేత్తకు ఇద్దరు కొడుకులు వారే ఒకరు బందిపోటు, మరొకరు ఫైలెట్. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శాస్త్రవేత్తకు భార్యగా నిత్యమీనన్, కొడుకు ఫైలెట్ ప్రేయసిగా సమంతలు నటిస్తున్నారు.

సీనియర్ నటులు గిరీష్ కర్నాడ్, అజయ్ మరో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ అయినటువంటి 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ సంయుక్తంగా ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  teaser  samantha  Nithya menon  stills  

Other Articles