Saif Ali Khan | angry | KI and KA, Arjun Kapoor | Kareena Kapoor

Saif ali khan angry on arjun kapoor call

Saif Ali Khan angry on Arjun kapoor, JI HUZOORI Video Song in KI and KA, KI and KA movie songs, KI and KA trailers, KI and KA videos, Arjun Kapoor movies, Arjun Kapoor stills, Kareena Kapoor latest news, Kareena Kapoor movies, Kareena Kapoor stills

Saif Ali Khan angry on Arjun kapoor call: Arjun Kapoor & Kareena Kapoor starring, R. Balki directed upcoming movie KI & KA whose story revolves around a young, married couple whose relationship challenges the gender roles placed upon women and men in Indian society. The song is Mithoon (ft. Deepali) in the lyrics of Sayeed Quadri & music composed, arranged and programmed by Mithoon himself.

రీల్ మొగుడి వల్ల రియల్ మొగుడు సీరియస్

Posted: 02/27/2016 11:35 AM IST
Saif ali khan angry on arjun kapoor call

రీల్ మొగుడి వల్ల రియల్ మొగుడు చిరాకు పడుతున్నట్లుగా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోహీరోయిన్లు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లు ఇటీవలే పెళ్లి చేసుకొని, సంతోషంగా జీవితం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీనా కపూర్... ప్రస్తుతం హిందీలో ‘కీ అండ్ కా’ అనే చిత్రంలో నటిస్తుంది.

ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా, అర్జున్ లు భార్యభర్తలుగా నటిస్తున్నారు. హౌస్ హస్బెండ్ పాత్రలో అర్జున్... ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేసే భార్య పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది.

అయితే అర్జున్ తో కరీనా చాలా క్లోజ్ గా వుంటుందని, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే ఓరోజు అర్థరాత్రి కరీనాకు అర్జున్ కపూర్ ఫోన్ చేసాడట. కానీ ఆ కాల్ ను సైఫ్ రిసీవ్ చేసుకొని, అర్జున్ గట్టిగా క్లాస్ పీకాడటని సమాచారం. దీంతో అర్జున్ పై ఎందుకలా సీరియస్ అయ్యావంటూ కరీనా-సైఫ్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం వీరిద్దరూ ఈ విషయంపై కాస్త సీరియస్ గా వున్నట్లుగా సమాచారం.

బాలీవుడ్ లో ఇపుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ సమయంలో కరీనాకు అర్జున్ కపూర్ ఎందుకు కాల్ చేసాడు? ఆ సమయంలో అర్జున్ తో సైఫ్ ఎలా స్పందించాడు? మరి సైఫ్-కరీనాల మధ్య విభేదాలు రావడానికి అర్జున్ కపూర్ కారణం కానున్నాడా? ఈ విషయంపై సైఫ్-కరీనాలతో పాటు అర్జున్ కపూర్ ఎలా స్పందించనున్నారో భవిష్యత్తులోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saif Ali Khan  angry  Arjun kapoor  Kareena Kapoor  KI and KA  stills  

Other Articles