Balakrishna performe with cricket bat

Balakrishna performe with cricket bat

Balakrishna, Nandamuri Balakrsihna, NBK

Nandamuri Balakrishna took bat and performe his batting skill in a new school opening. In Madhapur, Balakrishna inaugurates a school and he play cricket for fun.

బ్యాట్ పట్టిన బాలకృష్ణ.. అదిరగొట్టాడు

Posted: 02/22/2016 03:33 PM IST
Balakrishna performe with cricket bat

హీరోగా నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన డైలాగులతో, యాక్షన్ తో అభిమానులను అలరిస్తుంటారు. అయితే తాజాగా బాలకృష్ణ మరో కొత్త అవతారమెత్తారు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ సినిమాలు చూస్తూనే... రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తాజాగా మరో రంగంలోకి అడుగుపెడుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్రికెట్ పట్టి మైదానంలోకి దిగిన నందమూరి బాలకృష్ణ బ్యాట్ తోనూ అదరగొట్టారు. ఇంతకీ బాలకృష్ణ బ్యాట్ ఎందుకు పట్టాడు.. వచ్చే సినిమాలో ఏమైనా క్రికెటర్ గా నటిస్తున్నాడా అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.

నందమూరి బాలకృష్ఱ యాక్షన్ తో, డ్యాన్స్ లతో అందరిని ఆకట్టుకునే ఈ యువరత్న ఇప్పుడు మరోసారి తన అభిరుచిని చూపించారు. నందమూరి బాలకృష్ణ మాదాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్సెప్ట్‌ ప్లే, ఫుడ్‌ ఏరియా స్ట్రీట్‌ని ఆయన ప్రారంభించారు. అక్కడ సరదాగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆడిన ఆయన అనంతరం మీడియాతో మాట్లడుతూ.. తాను చిన్నతనంలో స్పోర్ట్స్‌లో ఉత్సాహంగా పాల్గొనేవాడినని క్రికెట్‌, కబడ్డీ కూడా బాగా ఆడేవాడినంటూ ఇప్పటికీ షూటింగ్‌కి వెళ్లినప్పుడు తనతో పాటు క్రికెట్‌ కిట్‌ ఉంటుందన్నారు. మొత్తానికి తాను అన్ని కళలను బాగా పోషిస్తాను అంటూ చెప్పకనే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Nandamuri Balakrsihna  NBK  

Other Articles