Dil Raju | Interview | Sunil | Krishnashtami | Trailers

Dil raju interview about krishnashtami

Dil Raju talks about Sunil Krishnashtami, Dil Raju talks about Sunil, Dil Raju interview, Krishnashtami release date, Krishnashtami movie trailers, Krishnashtami movie songs, Krishnashtami movie posters, Krishnashtami movie stills

Dil Raju interview about Krishnashtami: Producer Dil Raju Krishnashtami film release on 19 Feb. Sunil, Nikky galrani, Dimple chopadia acts in lead roles. dinesh music. vasu varma direction.

‘కృష్ణాష్టమి’ ఎలా సెట్ అయ్యిందో తెలుసా?

Posted: 02/17/2016 05:31 PM IST
Dil raju interview about krishnashtami

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’. సునీల్, నిక్కి గల్రానీ, డింపుల్ చొపాడియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ముందుగా సునీల్ తో కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీయాలని నిర్మాత దిల్ రాజు అనుకున్నాడట.

‘కృష్ణాష్టమి’ చిత్ర ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు మీడియాకు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ముందుగా ఈ ప్రాజెక్టును బన్నీతో అనుకున్నాం. కథ నచ్చడంతో వాసు వర్మకు కథ వినమని చెప్పాను. వాసువర్మ కథ విని, కానీ కథలో ఇంకా వర్క్ చేయాల్సి వుంది, చాలా మంచి సినిమా అవుతుందని అన్నాడు. ఇక వాసువర్మ స్రిప్ట్ డెవలప్ చేయడం స్టార్ చేశాడు అని అన్నారు.

ఓరోజు సునీల్‌ను పిలిపించి 20 నిమిషాల కథను వినిపించాం. తను వినగానే ఇంత పెద్ద బడ్జెట్‌ మూవీ నాతో ప్లాన్‌ చేస్తున్నారా? అని అన్నాడు. అయితే వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలియగానే వేరే సినిమా ఏదీ చేయకుండా ఈ సినిమా చేస్తానని అన్నాడు. అన్నమాట ప్రకారమే ఈ సినిమా 80శాతం పూర్తయ్యే వరకు ఏ సినిమా యాక్సెప్ట్‌ చేయలేదు. అలా సెట్‌ అయ్యిందే ‘కృష్ణాష్టమి’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

మొత్తానికి దిల్ రాజు బ్యానర్లో సునీల్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. దినేష్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnashtami  Dil Raju  Interviews  Trailers  Songs  

Other Articles