Bandla Ganesh | bags | 2 countries | telugu rights | stills

Bandla ganesh bags 2 countries movie telugu rights

Bandla Ganesh bags 2 countries telugu rights, Bandla Ganesh bags 2 countries rights, 2 countries telugu rights, Bandla Ganesh latest nwes, Bandla Ganesh stills, Bandla Ganesh movies

Bandla Ganesh bags 2 countries movie telugu rights: Malayalam hero Dileep Block buster film 2 Countries. Mamatha mohandas, Isha talvar acts in lead roles.

బండ్ల గణేష్ చేతిలో ‘2 కంట్రీస్’ తెలుగు రీమేక్ రైట్స్

Posted: 02/11/2016 10:49 AM IST
Bandla ganesh bags 2 countries movie telugu rights

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో హిట్ చిత్రాలను నిర్మించాడు. గత ఏడాది ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కానీ ‘టెంపర్’ తర్వాత మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లలేదు బండ్ల గణేష్.

మంచి కథ దొరికితే సినిమా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాడు. కొత్త కథలు వింటూనే ఇతర భాషలలో వచ్చిన సినిమాలపై కూడా ఓ కన్నేసారు బండ్ల గణేష్. గత ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘2 కంట్రీస్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి బండ్ల గణేష్ నిర్ణయించుకున్నాడు. మలయాళ స్టార్ హీరో దిలీప్, మమతా మోహన్ దాస్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలలో నటించారు. తక్కువ బడ్జెట్ తో రూపొంది 50 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బండ్ల గణేష్ తో పాటు తెలుగు ఇండస్ట్రీలోని పలు నిర్మాతలు కూడా పోటీ పడ్డారు. కానీ చివరగా ఓ ఫ్యాన్సీ ప్రైజ్ కి బండ్ల గణేష్ ‘2 కంట్రీస్’ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు. ఈ రీమేక్ లో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla Ganesh  2 countries  telugu rights  telugu movies  stills  

Other Articles