Balakrishna Latest Interview about Dictator

Balakrishna latest interview about dictator

Balakrishna interview about Dictator, Balakrishna Dictator Release on 14 January, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Latest Interview about Dictator: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

ఒక్క ఫోన్ చేస్తే ‘బాలా’ అంటూ వచ్చేస్తారు: డిక్టేటర్

Posted: 01/02/2016 05:28 PM IST
Balakrishna latest interview about dictator

టాలీవుడ్ నటసింహ, నందమూరి బాలకృష్ణ తన తోటి హీరోయిన్లపై ఓ కృష్ణబాణం వేసేసాడు. బాలయ్య నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే కొత్త సంవత్సరం సంధర్భంగా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తనతో నటించిన హీరోయిన్ల గురించి బాలయ్య చాలా సూటిగా సమాధానమిచ్చేసాడు.

ఈ సంధర్భంగా బాలయ్య మాట్లాడుతూ... నా ప్రతీ సినిమాలో హీరోయిన్లకు మంచి పేరు వస్తుంది. ‘శ్రీరామరాజ్యం’ సినిమాతో నయనతారకు నటిగా మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో నయనతార లేకపోతే సినిమానే లేదని నేనే బహిరంగంగా చెప్పాను. నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు... మా బాలా ఫోన్ చేసారని నా హీరోయిన్లు నామీద వున్న నమ్మకంతో నా సినిమా చేయడానికి ఒప్పుకుంటారని బాలయ్య అన్నారు.


idlebrainlive

అలాగే ఈ ‘డిక్టేటర్’ సినిమాలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటించారు. అంజలి, సోనాల్ చౌహన్ల గురించి బాలయ్య మాట్లాడుతూ... మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క తెలుగమ్మాయిలు లేరని చెప్పుకోవాలి. కానీ అంజలి అచ్చమైన తెలుగమ్మాయి. ఇలాంటి తరుణంలో ఒక సావిత్రిగారిలాగా చేసింది అంజలి. ఈ సినిమా ఆ అమ్మాయికి ఇంకో మంచి మలుపు అవుతుంది. అంజలి నాలాగే గలగలా మాట్లాడుతూ ఉంటుంది. చాలా ప్రొఫెషనల్‌ గా, చెప్పినవి చాలా తొందరగా గ్రాస్ప్‌ చేస్తుంది. చెప్పినదాన్ని చక్కగా ప్రొడ్యూస్‌ చేయగలుగుతుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే సొనాల్ గురించి మాట్లాడుతూ... నా మీద వున్న నమ్మకంతో.. ‘మా బాలా ఫోన్ చేసాడు.. రెఢీ’ అనే విధంగా ఎన్ని రోజులైనా డేట్స్ సర్దుబాటు చేసి, చేయడానికి ముందుకొచ్చారు. అంత మంచి అండర్ స్టాండింగ్ వుంది. ‘లెజెండ్’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో చేసారు అని చెప్పుకొచ్చాడు.

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  interview  Dictator  Release Date  Anjali  sonal chauhan  stills  

Other Articles