Shraddha Kapur Aditya Roy Kapoor in OK Kanmani remake

Shraddha kapur aditya roy kapoor in ok kanmani remake

OK Kanmani remake into Bollywood, OK Kanmani remake, Aditya roy kapoor Shraddha kapoor in OK Kanmani remake, OK Kanmani hindi remake, Shraddha Kapur, Aditya Roy Kapoor, Shraddha Kapur Aditya Roy Kapoor again romance

OK Kanmani remake into Bollywood: Kollywood actress Nithya menon and malayalam actor Dulqar salman latest hit film OK Kanmani going to remake into bollywood. Shad director.

బాలీవుడ్ లో నిత్యామీనన్ సహజీవనం

Posted: 01/02/2016 04:16 PM IST
Shraddha kapur aditya roy kapoor in ok kanmani remake

బబ్లీ హీరోయిన్ నిత్యామీనన్ లవ్ స్టోరీ బాలీవుడ్ లో కూడా ప్రచారం కానుంది. నిత్యామీనన్ లవ్ స్టోరీ బాలీవుడ్ జనాలు కూడా ఆస్వాదించనున్నారు. ఇంతకీ నిత్యామీనన్ లవ్ స్టోరీ ఎంటనీ అనుకుంటున్నారా? నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఓకే కన్మణి’(తెలుగులో ఓకే బంగారం).

ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమించుకున్న ఓ జంట కలిసి, సహజీవనం చేస్తూ, చివరకు ఒకరిని విడిచి ఒకరు వుండలేక పెళ్లి చేసుకోవడం ఈ సినిమా కథాంశం. ఇప్పటియువతరం ఎక్కువగా ఇలాంటి సహజీవనానికే అలవాటు పడుతున్నారు. అయితే ఇందులో నిత్యా-దుల్కర్ ల నటన చాలా బాగుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

ఈ హిందీ రీమేక్ లో బాలీవుడ్ ‘ఆషీకి2’ జంట ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ధాకపూర్ లను ఖరారు చేసినట్లు నిర్మాత కరణ్ జోహర్ ప్రకటించారు. ఆదిత్యా-శ్రద్ధాలు కలిసి నటించిన ‘ఆషికీ2’ ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇందులో వీరి కెమిస్ట్రీకి చాలా మంచి పేరొచ్చింది. అందుకే ఈ రీమేక్ కోసం కూడా వీరినే ఎంపిక చేసారు. ఈ సినిమాకు షాద్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ చిత్రాన్ని హిందీలో షాద్ దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OK Kanmani  Remake  Shraddha Kapur  Aditya Roy Kapoor  Bollywood  

Other Articles