Ram Charan Again Romance with Shruti Haasan

Ram charan again romance with shruti haasan

Ram Charan Again Pairup with Shruti Haasan, Ram Charan Romance with Shruti Haasan, Shruti Haasan in Thani Oruvan Remake, Ram Charan Shruti Haasan Latest film, Ram Charan movies, Ram Charan movie updates, Ram Charan stills, Shruti Haasan stills, Shruti Haasan latest news, Shruti Haasan movies, Shruti Haasan

Ram Charan Again Romance with Shruti Haasan: Mega Powerstar Ram charan upcoming film Thani Oruvan Remake. Surendher reddy direction.

నయనతార స్థానంలో శృతిహాసన్

Posted: 12/22/2015 05:57 PM IST
Ram charan again romance with shruti haasan

‘బ్రూస్ లీ’ తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ఓ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమిళంలో జయం రవి, నయనతార, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘థని ఒరువన్’. ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో రాంచరణ్ హీరోగా రీమేక్ చేయనున్నారు.

తెలుగులో ప్రముఖ కమర్షియల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం తెలుగు నేటివిటికి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. అయితే తమిళంలో జయంరవి సరసన హీరోయిన్ గా నయనతార నటించింది. తెలుగులో చరణ్ సరసన శృతిహాసన్ ను ఎంపిక చేసారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘ఎవడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది. మరోసారి ఈ రీమేక్ తో చరణ్-శృతిహాసన్ లు జతకట్టనున్నారు. తమిళంలో అరవింద్ స్వామి నటించిన విలన్ పాత్రను తెలుగులో కూడా అరవింద్ స్వామితో చేయించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Ram charan  Hot stills  Movie news  Thani Oruvan remake  

Other Articles