Victory Venkatesh Turns 55 today

Victory venkatesh celebrates birthday

victory venkatesh celebrates birthday, venkatesh telugu movie, venkatesh latest updates, venkatesh news, venkatesh, babu bangram, maruthi, birthday ,venkatesh ,family hero ,remake ,comedy ,ramanaidu

Daggubati Venkatesh turns a year older. The star who is readying up to start his next film is celebrating his birthday today(December 13) in low key manner.

55వ పడిలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్

Posted: 12/13/2015 02:25 PM IST
Victory venkatesh celebrates birthday

ఫ్యామిలీ హీరోగా మంచి ప్రేక్షాకదరణ పొందిన విక్టరీ వెంకటేష్ ఇవాళ 55వ పడిలోకి అడుగుపెట్టారు. చానాళ్ల తరువాత టాలీవుడ్ లో ఆయన మల్టీ స్టారర్ చిత్రాలకు తెరలేపారు. మహేష్ ,పవన్ లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ, వాటికి మంచి ఆదరణ వచ్చేలా ప్రయత్నించారు. వెంకటేష్ సినిమా అంటే అది పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీనే అయి ఉంటుందనే భావనను అభిమానులలోకి తీసుకు వెళ్లారు. రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులచే తన పేరు ముందు విక్టరీని ఇంటిపేరులా మార్చుకునేలా చేశారు.

1960 డిసెబంర్ 13 న జన్మించిన వెంకీ ఇప్పటి వరకు దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించగా , ఎన్నో అవార్డులను అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత దృశ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ హీరో మల్టీ స్టారర్ చిత్రాలను మరింత ప్రోత్సహించారు. అయితే గోపాల గోపాల తర్వాత మరే సినిమా చేయని వెంకీ తాజాగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ మారుతి డైరెక్షన్ లో బాబు బంగారం అనే చిత్రాన్ని చేయనుండగా త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు సమాచారం

కాగా విక్డరీ వెంకటేష్ జన్మదిన వేడుకను పురస్కరించుకుని.. వేడుకలు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ కు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు గతంలో తాము వెంకటేష్ తో తీసుకున్న ఫోటోలను, సెల్ఫీలను పోస్ట్ చేస్తూ, అభినందనలు తెలిపారు. హీరో సుమంత్ "హ్యాపీ బర్త్ డే విక్టరీ వెంకటేష్ బావా" అంటే, హీరోయిన్ అనుష్క "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారూ, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే" అంటూ విషెస్ చెప్పింది.

ఇక సాయికుమార్ "విషింగ్ 'విక్టరీ' వెంకటేష్ హ్యాపీ బర్త్ డే" అనగా, దగ్గుబాటి రానా "హ్యాపీ బర్త్ డే చిన్నాన్నా" అని, కమేడియన్ అలీ "విక్టరీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనతో ఎన్నో సినిమాలు కలిసి చేసినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. అందరూ మెచ్చే వ్యక్తి ఆయన. మరెన్నో సంతోషకరమైన సంవత్సరాలు ఆయన ముందున్నాయి" అని అన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ "విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే టు వెంకటేష్ సార్! హోప్ యూ హ్యావ్ ఏ సూపర్బ్ ఇయర్" అనగా, దర్శకుడు రాజమౌళి "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారు, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే!" అని తన శుభాకాంక్షలను పోస్ట్ చేశారు.

ఇలా తెలుగుచిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు, నటీమణులును, దర్శకులు వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. మంచి టైమింగ్ , ఢిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ , వెరైటీ కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న వెంకీ రానున్న రోజుల్లో తన సినిమాలతో మరింతగా అలరించాలని, ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని మనమూ మనసారా కోరుకుంటటూ మెనీ హ్యాపీ రిటర్స్ అప్ ది డే చెబుదాం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : birthday  venkatesh  family hero  remake  comedy  ramanaidu  

Other Articles