Bajirao Mastani | Telugu poster | Trailer | Ranveer Singh | Deepika Padukone

Bajirao mastani also release in telugu and tamil

Bajirao Mastani Movie Also Release in Telugu and Tamil, Bajirao Mastani Official Trailer, Priyanka chopra Pinga Video Song, Bajirao Mastani songs, Bajirao Mastani videos, Bajirao Mastani release date, Bajirao Mastani posters, Bajirao Mastani stills, Bajirao Mastani

Bajirao Mastani Also Release in Telugu and Tamil: Eros International and Sanjay Leela Bhansali’s forthcoming magnum opus Bajirao Mastani, slated to release on December 18 worldwide, will also release in Tamil and Telugu languages. Ranveer Singh, Deepika Padukone & Priyanka Chopra. Directed by: Sanjay Leela Bhansali. Produced by: Kishore Lulla & Sanjay Leela Bhansali.

తెలుగు, తమిళంలో ‘బాజీరావు మస్తానీ’

Posted: 11/27/2015 10:53 AM IST
Bajirao mastani also release in telugu and tamil

ఈరోస్ ఇంట‌ర్నేష‌న్తల్‌, బ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో తెలుగు, త‌మిళంలో భారీ లెవల్లో విడుద‌ల‌వుతున్న ‘బాజీరావు మ‌స్తానీ’. ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావు మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.

బాహుబ‌లి, ఎందిర‌న్‌(రోబో) చిత్రాలకు వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌ద‌న్ క‌ర్కే ఈ సినిమాకు పాట‌లు, మాట‌లు రాశారు. అలాగే శ్రీమంతుడు, బాహ‌బ‌లి చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన ప్రముఖ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి తెలుగులో పాట‌ల‌ను రాశారు. బాజీరావు మ‌స్తానీ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీలో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్ మీడియా లి. సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ నందు అహుజా మాట్లాడుతూ... ‘’ద‌క్షిణాదిన పీరియాడిక‌ల్ డ్రామా చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని తెలుసు. అందుకు బాజీరావు మ‌స్తానీ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్‌లో అనువాదం చేసి విడుదల చేస్తున్నాం. అద్భుత‌మైన క‌థ‌, ఎపిక్ డ్రామా ప్రేక్ష‌కుల‌ను న‌చ్చుతుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేసింది. బాజీరావు మ‌స్తానీ వంటి గ్లోబెల్ మూవీని సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు.

సంజయ్ లీలా బ‌న్సాలీ మాట్లాడుతూ ‘’బాజీరావు మ‌స్తానీ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో కూడా విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్ప‌డానికి చాలా ఆనందంగా ఉంది. చాలా సంవ‌త్స‌రాల క‌ల ఈ సినిమా. ప్రేక్ష‌కుంలంద‌రికీ ఈ క‌ల త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు వారి భాష‌లోనే సినిమాను చూడబోతున్నారు’’ అన్నారు.

Bajirao Mastani Movie Also Release in Telugu and Tamil-02

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత సంజయ్‌లీలా బ‌న్సాలీ నుండి వ‌స్తున్న‌ మ‌రో మాస్ట‌ర్ పీస్ మూవీ ఇది. ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికాప‌దుకొనే, ప్రియాంక చోప్రా వంటి టాప్ స్టార్స్ న‌టించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 18న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajirao Mastani  Telugu poster  Trailer  Ranveer Singh  Deepika Padukone  Priyanka Chopra  

Other Articles