Amitabh Bachchan | Health Condition | News

Amitabh bachchan health condition critical

Amitabh Bachchan Health Condition, Amitabh Bachchan Health Condition serious, Amitabh Bachchan Health news, Amitabh Bachchan health critically, Amitabh Bachchan Health updates, Amitabh Bachchan

Amitabh Bachchan Health Condition Critical: Bollywood super star Amitabh Bachchan Health Condition serious. Amitabh Bachchan has liver cirrhosis, surviving on just 25% of his liver.

అమితాబ్ ఆరోగ్యం క్రిటికల్... 25శాతంతో బిగ్ బి ఆరోగ్యం

Posted: 11/25/2015 03:10 PM IST
Amitabh bachchan health condition critical

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన అభిమానులను టెన్షన్ పడే విధంగా ఓ విషయాన్ని బయటపెట్టారు. గతకొద్ది రోజులుగా అమితాబ్ బచ్చన్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కు వెళుతూ చికిత్స పొందుతూ, మళ్లీ వెంటనే ఆరోగ్యంతో బయటకు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులంతా అమితాబ్ బచ్చన్ ఏదో రెగ్యులర్ హెల్త్ చెకప్ ల కోసం హాస్పిటల్ కు వెళుతున్నాడేమో అని అనుకున్నారు. కానీ అభిమానులకు అమితాబ్ ఓ షాకింగ్ న్యూస్ ను అందించాడు.

తనకు హెపటైటిస్ బి వైరస్ సోకిందని, అందువల్ల 75శాతం లివర్ పాడైపోయిందని, ప్రస్తుతం 25 శాతం లివర్ ఆరోగ్యంగా వుందని అమితాబ్ బచ్చన్ చెప్పారు. 1983లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘కూలీ’ చిత్ర షూటింగ్ సమయంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు చాలా రక్తం అవసరమయ్యింది. దీంతో అమితాబ్ కు దాదాపుగా రెండు వందల మంది రక్తదానం చేసారు. దాదాపు 60 బాటిల్ల రక్తం వరకు అమితాబ్ కు ఎక్కించారు.

అయితే ఈ విషయంపై తాజాగా అమితాబ్ తెలియజేస్తూ... ఆ సమయంలో తనకు దాదాపు 200 మంది రక్తదానం చేసారని, ఆ క్రమంలోనే ఈ హెపటైటిస్ బి అనే వైరస్ వచ్చి వుంటుందని అన్నారు. కానీ యాక్సిడెంట్ అయిన 18 ఏళ్ల వరకు అంటే 2000 సంవత్సరం వరకు ఎలాంటి సమస్య రాలేదని, మెడికల్ చెకప్ లో కూడా అంతా నార్మల్ గానే వచ్చిందని బిగ్ చెప్పుకొచ్చారు. కానీ చాలా ఏళ్ల తర్వాత వివిధ టెస్టులు చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. అప్పటికే దాదాపు 75 శాతం లివర్ పాడైపోయినట్లుగా గుర్తించారు. ఇపుడు మీ ముందు ఇలా నిలబడి వున్నానంటే దానికి గల కారణం ఆ 25 శాతం లివర్ ఆరోగ్యంగా వుండటం వల్లనే అని బిగ్ బి చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Health Condition  News  stills  

Other Articles