Aamir khan | Comments | Bollywood Celebrities

Celebrities fires on aamir khan comments

Bollywood Celebrities comments on Aamir khan, Aamir khan latest news, Aamir khan hot news, Aamir khan tweets, Aamir khan latest tweets, Aamir khan news, Comments on Aamir khan, tweets on Aamir khan, indians angry on Aamir khan

Celebrities fires on Aamir khan comments: Bollywood celebrities Anupam Kher, Raveena Tandon, Rishi kapoor, have criticised Bollywood superstar Aamir Khan for his intolerance remarks.

తీవ్ర కలకలం సృష్టిస్తున్న అమీర్ వ్యాఖ్యలు

Posted: 11/25/2015 09:35 AM IST
Celebrities fires on aamir khan comments

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇటీవలే చోటుచేసుకున్న కొన్ని అసహనపు ఘటనలతో దేశం విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగినట్లుగా అమీర్ ఖాన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అమీర్ ఖాన్ చెప్పిన ఈ మాటలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లివెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం అమీర్ ఖాన్ చేసిన కామెంట్లపై అతనికి దేశవ్యాప్తంగా భారీ విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తన తోటి నటీనటులు, సినీ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

అయితే కొందరు అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటుడు రిషీ కపూర్ స్పందిస్తూ... అమీర్ ఖాన్.. తప్పులు జరుగుతుంటే వ్యవస్థను సరిదిద్దాలి, తప్పులు సరిచేయాలి. అలా చేయడమే హీరోయిజం అవుతుంది. అంతేకానీ దేశం విడిచి పారిపోకూడదు అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.

అలాగే రాంగోపాల్ వర్మ, పరేశ్ రావల్, హీరోయిన్ రవీనా టాండన్, రచయిత్రి తస్లీమా నస్రీన్ లతో పాటు చాలా మంది ప్రముఖులు అమీర్ ఖాన్ కు వ్యతిరేఖంగా కామెంట్లు చేయగా... పలువురు కాంగ్రెస్ నేతలు, అరవింద్ కేజ్రివాల్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు అమీర్ కు మద్ధతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir khan  comments  Bollywood Celebrities  tweets  

Other Articles