Manchu Vishnu | Sarada | First Look

Manchu vishnu sarada first look release

Manchu Vishnu Sarada Movie First Look, Manchu Vishnu Sarada First Look, Manchu Vishnu Sarada stills, Manchu Vishnu Sarada posters, Manchu Vishnu Sarada movie news, Manchu Vishnu Sarada heroine, Manchu Vishnu Sarada news, Manchu Vishnu Sarada movie posters, Manchu Vishnu Sarada

Manchu Vishnu Sarada First Look Release: Manchu Vishnu latest film Sarada. Sonarika heroine. This film first look released today.

కొత్త లుక్స్ తో మంచు విష్ణు... ‘సరదా’ ఫస్ట్ లుక్ అదుర్స్

Posted: 11/23/2015 09:17 AM IST
Manchu vishnu sarada first look release

మంచు విష్ణు, సోనారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరదా’. డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోంది. ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ ప‌ల్లి కేశ‌వరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభమైన ఈ చిత్రం రెండో షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. నవంబర్ 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జి.కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ... మంచు విష్ణు లాంటి హీరోతో సరదా చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మంచు విష్ణు కొత్త బాడీ లాంగ్వేజ్ తో, న్యూ లుక్ లో కనపడతారు. కథ వినగానే ఆయనకు నచ్చడంతో సినిమా కొత్త లుక్ కోసం అమెరికా నుండి ట్రైనర్ రప్పించుకుని సిక్స్ ప్యాక్ చేశారు. కథానుగుణంగా ట్రెండ్రీ లుక్ అందరికీ తప్పుకుండా నచ్చుతుంది. మంచు విష్ణు సోమావిజయ్ ప్రకాష్, పల్లి కేశవ్ రావ్ వంటి మంచి నిర్మాతలు ఈ చిత్రంలో ఉండటం చాలా హ్యపీగా ఉంది. ‘సరదా’ లవ్ అండ్ యూత్ ఫుల్ ప్యామిలీ ఎంటర్ టైనర్. ప్రతి మనిషిలో సరదా ఉంటుంది. ప్రతి ప్రేమలోనూ సరదా ఉంటుంది. ఆ సరదాను హైలైట్ చేస్తూ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.‘సరదా’ రెండో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. విష్ణుగారి సరికొత్త బాడీ లాంగ్వేజ్ , సరికొత్త డైలాగ్ డెలివరీని ఈ చిత్రంలో చూస్తారు. టైటిల్ కు తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి ఒక్కరూ చూసేలా ‘సరదా’గా, ఎంటర్ టైనింగ్ గా సాగే చిత్రం. అనూప్ మ్యూజిక్, విజ‌య్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.

Manchu Vishnu Sarada Movie First Look

చిత్ర నిర్మాత‌లు సోమా విజయ్ ప్రకాష్, ప‌ల్లికేశ‌వ‌రావ్ మాట్లాడుతూ ”మా బ్యానర్ లో చేస్తున్న రెండో మూవీ ‘సరదా’. ‘సరదా’ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాం. ‘సరదా’ అనే టైటిల్ ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉందో సినిమాలో అంతకంటే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టే ‘సరదా’లో దర్శకుడు కార్తీక్ రెడ్డిగారు మంచు విష్ణుని కొత్తగా చూపిస్తున్నారు. సోనారికతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. ఆమె వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మా ‘సరదా’ రెండో షెడ్యూల్ పూర్తయింది. మంచు విష్ణుగారు ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశారు. అనూప్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. కథతో పాటు కామెడి కలిసి ఉండి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది” అన్నారు.

బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్‌ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌: యస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఫైట్స్‌: విజయ్‌, పి.ఆర్‌.ఓ: వంశీ-శేఖర్‌,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్‌, నిర్మాతలు: సోమా విజయ్ ప్రకాష్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్‌ రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Sarada  First Look  Stills  Posters  Sonarika  

Other Articles

 • Naga shourya seeks chiranjeevi blessings before release of ashwathama

  విడుదలకు ముందు.. ‘అశ్వథ్థామ’కు మెగా దీవెనలు

  Jan 29 | యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్ధామ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులలో అంచానాలను పెంచింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచింది. రమణ తేజను దర్శకుడిగా... Read more

 • Jaanu teaser out samantha and sharwanand s film is all about unspoken love

  ఆర్ యు ఏ వర్జిన్.? సామ్ ప్రశ్నకు కంగారుపడిన శర్వా..

  Jan 29 | వైవిద్యమైన చిత్రాలను ఎంచుకుంటూ విజయాల మార్గంలో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘96’ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా తెలుగులో ‘జాను’ పేరుతో... Read more

 • World famous lover second single gets the right mix of class and mass

  వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి రెండో సింగిల్ అదుర్స్.!

  Jan 29 | సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి హృద్యమైన సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ... Read more

 • Maa row jeevitha writes to disciplinary committee against naresh

  ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై చర్యలకు సభ్యుల లేఖ

  Jan 28 | మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) లో మళ్లీ అసంతృప్తి మంటలు ఎగసిపడుతున్నాయి. అధికారంలో ఎవరు వున్నా.. వారిపై విమర్శలు, అరోపణలు రావడం.. ఫలితంగా ప్రధాన కార్యదర్శి సహా ఈసీ సభ్యులు ఎదురు తిరగడం కామన్ గా... Read more

 • Salman khan loses cool snatches fan s phone at goa airport

  సల్లూ భాయ్.. బాలీవుడ్ బాలయ్యా.? వీడియో వైరల్..

  Jan 28 | బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా... Read more

Today on Telugu Wishesh