Ilayaraja music for Nara Rohit Kathalo Rajakumari film

Ilayaraja music for nara rohit kathalo rajakumari film

Ilayaraja music scores for Nara Rohit film, Ilayaraja music for Nara Rohit film, Ilayaraja music for Kathalo Rajakumari, Nara Rohit movie news, Nara Rohit latest stills, Nara Rohit movie updates, Nara Rohit upcoming movies, Nara Rohit

Ilayaraja music for Nara Rohit Kathalo Rajakumari film: Tollywood young hero Nara Rohit upcoming film Kathalo Rajakumari. Ilayaraja music scores for this film.

ఇళయరాజా సంగీతంలో కథలో రాజకుమారి

Posted: 11/21/2015 10:39 AM IST
Ilayaraja music for nara rohit kathalo rajakumari film

యువ హీరోలంతా కూడా మెలోడి కింగ్ మాస్ట్రో ఇళయరాజాపై పడ్డారు. యువ హీరోలంతా యూత్ ఫుల్ సినిమాలు తీస్తున్నారు కానీ మ్యూజిక్ మాత్రం ఇళయరాజా పాటల తరహాలోనే చాలా సింపుల్ గా, వినసొంపుగా వుండేందుకు తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా నాగశౌర్య తన కొత్త చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’ కోసం ఇళయరాజాను సంప్రదించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఇదే జాబితాలోకి తాజాగా మరో యువ హీరో వచ్చి చేరాడు.

హిట్టులు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా వున్న యువ హీరో నారా రోహిత్. ‘బాణం’, ‘సోలో’ చిత్రాల తర్వాత నారా రోహిత్ నటించిన ఏ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయినా కూడా నారా రోహిత్ కు వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

అందులో నారా రోహిత్ నటిస్తున్న ‘కథలో రాజకుమారి’ చిత్రం ఒకటి. ఈ సినిమాతో మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మెస్టో ఇళయరాజా సంగీతం అందించనున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్ర త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న ‘పండగలా వచ్చాడు’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘తుంటరి’ సినిమా షూటింగ్ లు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ‘వీరుడు’, ‘కథలో రాజకుమారి’, ‘జ్యో అచ్యుతానంద’ ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Ilayaraja music  Kathalo Rajakumari  Movie news  stills  

Other Articles