Balakrishna Dictator Movie Audio Release on 20 December

Balakrishna dictator movie audio release on 20 december

Balakrishna Dictator Movie Audio Date, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Dictator Movie Audio Release on 20 December: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

బాలయ్య ‘డిక్టేటర్’ ఆడియోకు లక్షలాది మంది అభిమానులు రాక!

Posted: 11/17/2015 01:10 PM IST
Balakrishna dictator movie audio release on 20 december

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అంజలి, సోనల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బాలయ్య లుక్ చాలా కొత్తగా కనిపిస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గణేశా..’ అనే పాట ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్ర ఆడియోను గ్రాండ్ గా చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ‘డిక్టేటర్’ ఆడియోను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు పాల్గొననున్నట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ ఆడియోను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Audio Release Venue  Anjali  sonal chauhan  stills  

Other Articles