actor vinod kumar arrested

Actor vinod kumar arrested

telugu actor vinod kumar arrested, actor vinod kumar arrested, actor vinod kumar arrest news, actor vinod kumar latest news, actor vinod kumar gossips, actor vinod kumar movies, actor vinod kumar stills, actor vinod kumar songs, actor vinod kumar

actor vinod kumar arrested: actor Vinod kumar arrested. he acted in telugu, tamil, kannada languages.

ప్రముఖ నటుడు వినోద్ కుమార్ అరెస్ట్

Posted: 11/17/2015 11:02 AM IST
Actor vinod kumar arrested

గతంలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించి, నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న వినోద్ కుమార్ తన సొంత గ్రామంలో పోలీసులు అరెస్టు చేసారు. వినోద్ కుమార్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వ్యక్తిగతంగా సచ్చిదానంద అనే వ్యక్తి మేనేజర్ గా వ్యవహరించేవారు. అయితే వినోద్ కుమార్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో ఏదో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మేనేజర్ సచ్చిదానందపై వినోద్ కుమార్ హత్యాయత్నానికి ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కర్నాటకలోని పుత్తూరు పరిధిలో సంప్య పోలీస్ స్టేషన్లో సచ్చిదానంద ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు వినోద్ కుమార్ దాడికి యత్నించిన విషయం వాస్తవమేనని నిర్దారణ అయినట్లుగా తెలుస్తోంది.


Video Courtesy : Shalimar Telugu & Hindi Movies

దీంతో తన స్వగ్రామమైన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలుకా ఈశ్వర మంగలలో వున్న వినోద్ కుమార్ ను అక్కడే పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. మరి ఈ విషయంపై వినోద్ కుమార్ ఎలా స్పందించనున్నారో చూడాలి. వినోద్ కుమార్ కన్నడ, తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. తెలుగులో వినోద్ కుమార్ నటించిన పలు చిత్రాలలోని పాటలు ఇప్పటికీ మారుమ్రోగుతూనే వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor vinod kumar  Arrest  Sacchidananda  Movie News  stills  

Other Articles