Avika Ghor Thanu Nenu Movie Shooting Completed

Avika ghor thanu nenu movie shooting completed

Thanu Nenu Theatrical Trailer, Thanu Nenu Movie Stills, Thanu Nenu Trailer, Avika Ghor movie news, Avika Ghor stills, Avika Ghor movies, Avika Ghor movie updates, Avika Ghor

Avika Ghor Thanu Nenu Movie Shooting Completed: Avika Ghor latest film Thanu Nenu. P Rammohan direction. Sunny MR Music. Santhosh Shobhan introduce as a hero.

అవికా ‘తను నేను’ షూటింగ్ పూర్తి

Posted: 11/12/2015 09:49 AM IST
Avika ghor thanu nenu movie shooting completed

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో అవికా గోర్, సంతోష్ శోభన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తను నేను’. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌.పి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రమిది.

‘వర్షం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా పరిచయమవుతున్నాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘తను నేను’ షూటింగ్‌ పూర్తయింది.


Video Courtesy : Shreyas Media

తాజాగా దీపావళి సంధర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ‘తను నేను’ ట్రైలర్ ప్రదర్శించబడుతోంది. సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avika Ghor  Thanu Nenu  Theatrical Trailer  Stills  

Other Articles