colors swathi says she is ready to do glamour roles in her latest interview | tripura movie updates | tripura controversy

Colors swathi says she is ready to do glamour roles in movies

colors swathi news, colors swathi movies, colors swathi updates, swathi controversies, swathi photo shoot, swathi latest photo shoot, swathi glamour roles

colors swathi says she is ready to do glamour roles in movies : colors swathi says she is ready to do glamour roles in her latest interview.

ఆ పాత్రల్లో నటించేందుకు రెడీ అంటున్న స్వాతి

Posted: 11/03/2015 07:42 PM IST
Colors swathi says she is ready to do glamour roles in movies

బుల్లితెర నుంచి వెండితెరకి ప్రమోషన్ అందుకున్న కలర్స్ స్వాతి.. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే.. ఈ అమ్మడు ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో నటించలేదు. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది తప్ప.. కుర్రకారును హీటెక్కించే విధంగా పొట్టి డ్రెస్సులు వేసుకుని వెండితెరపై కనిపించలేదు. ఓవైపు స్టార్ హీరోయిన్లు సైతం బికినీలు వేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంటే.. ఈమె మాత్రం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ హోమ్లీగా కనిపించింది. దీంతో ఈమె గ్లామర్ పాత్రల్లో కనిపించదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్వాతి.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, తాను గ్లామర్ రోల్స్ లో నటించడానికి సిద్ధమేనని తేల్చి చెప్పేసింది.

తాజాగా స్వాతి టైటిల్ రోల్ లో నటించిన ‘త్రిపుర’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఈ అమ్మడు.. ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు రీసెంట్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా మీడియా ప్రతినిధి ఆమెను.. ‘మీరు గ్లామర్ రోల్స్ కి దూరమా’ అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ బదులిచ్చింది. ‘నేను గ్లామర్ రోల్స్ కి దూరంగా లేను. కెరీర్ ప్రారంభం నుంచే గ్లామర్ తరహా పాత్రలకి, మోడ్రన్ డ్రెస్సులో కనిపించడానికి సిద్ధంగా వున్నాను. నా ప్రకారం వల్గర్ గా లేనంత వరకూ ఎంత గ్లామర్ గా అయినా కనిపించవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నా దగ్గరి వచ్చే కథలు, అవకాశాలు అన్నీ హోమ్లీ లుక్ ఉన్న పాత్రలే రావడం వలన గ్లామర్ డాల్ రోల్స్ లో కనిపించలేకపోయాను’ అని స్వాతి చెప్పింది. దీంతో.. ఈ అమ్మడు హాట్ సన్నివేశాల్లో నటించేందుకు రెడీ అంటూ చెప్పకనే చెప్పేసిందన్నమాట.

ఇదిలావుండగా.. ఇటీవల ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ బాగానే పెరిగింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు స్టార్ హీరోయిన్లు.. లిప్ లాక్, హాట్ సన్నివేశాలతోపాటు బికినీల్లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీంతో వారికి వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. కానీ.. స్వాతికి కేవలం హోమ్లీ పాత్రలే దక్కుతున్నాయి. ఇటువంటి పాత్రలే చేసుకుంటూపోతే తన కెరీర్ గాడిలో పడే ప్రమాదముందని భావించిన ఈ భామ.. గ్లామర్ రోల్స్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swathi glamour roles  colors swathi updates  tripura movie news  

Other Articles