Aishwarya Rai Bachchcan to celebrate 42nd birthday with husband Abhishek and daughter Aaradhya

Aishwarya rai bachchan turns 42

aishwarya rai bachchcan, aishwarya rai bachchcan movies, aishwarya rai bachchcan birthday, happy birthday aishwarya rai bachchcan, aishwarya rai bachchcan turns 42, abhishek bachchan, aaradhya bachchan, aishwarya rai abhishek bachchan, aishwarya rai aaradhya, aishwarya rai birthday, happy birthday aishwarya, entertainment news

Aishwarya has reportedly taken special permission from director Karan Johar to take a day off from work to celebrate with Abhishek and Aaradhya

42వవ పడిలో అడుగుపెట్టిన అందాల రాశి ఐశ్వర్య రాయ్

Posted: 11/01/2015 05:43 PM IST
Aishwarya rai bachchan turns 42

వెండితెర అందాల రాశి, ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ ఇవాళ 42వ పడిలో అడుగుపెట్టారు. బాలీవుడ్ లో నటిగా ఓ వెలుగు వెలిగిన ఐష్.. ఓ పాపకు తల్లయ్యాక ఐదేళ్ల విరామం అనంతరం ఇటీవలే 'జబ్బా' మూవీతో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండవ ఇన్నంగ్స్ లోనూ ఐశ్వర్య హిట్ కొట్టి ఉత్సాహంగా ఉంది. నలభై ఏళ్లు దాటినా వన్నె తరగని అందంతో అభిమానులను అలరిస్తున్న ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా తన మనస్సులోని మాటలను పంచుకున్నారు.

తాను ఎలా వంట చేస్తానో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపించారని, అయితే తాను మాత్రం బాగానే వంట చేస్తానని చెప్పింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో హల్వా చేశాను, ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి బెండకాయ, పరాటా వండాను. నిజానికి నేను వంట గదిలో గడిపేది చాలా తక్కువ సమయం. కానీ ఆరాధ్య పుట్టాక చాలా మారిపోయాను. తనకు తినిపించడానికి గంట గంటలు వంటింట్లో గడిపాను. ప్రొటీన్స్ అందేలా.. తనకు నచ్చేలా ఫుడ్ తయారు చేయడానికి బోలెడు ప్రయోగాలు చేశాను. ఫైనల్లీ.. ఇప్పుడు ఆరాధ్య మారాం చేయకుండా మేమంతా తినే ఆహారమే తింటుంది.

'ప్రపంచ సుందరి, నటీమణి, భార్య, తల్లి.. ఇవే నా బెస్ట్ రోల్స్. మిస్ వరల్డ్ టైలిల్ గెలుచుకునే ముందురోజు వరకు నేనొక సాధారణ విద్యార్థిని. కానీ ప్రపంచ సుందరి కిరీటం వరించడంతో ఒకే ఒక్క రాత్రిలో నా జీవితం మారిపోయింది. ఆ కిరీటం కీర్తితోపాటు బాధ్యతలను కూడా తెచ్చిపెట్టింది. కేవలం అందాల రాశిగా ఉండటం కాదు, ఎంతో నేర్చుకోవాలి, ఎన్నో సాధించాలి అని అర్థమైంది. అనుకోకుండా సినిమాల్లో అవకాశం రావడం నా జీవితాన్ని మలుపు తిప్పిందని ఐశ్వర్య తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai Bachchan  Birthday  Interview  

Other Articles