Sumanth Ashwin | Columbus | Censor Report

Columbus movie censor report

Sumanth Ashwin Columbus Movie Censor Report, Sumanth Ashwin Columbus Trailer Launch, Sumanth Ashwin Columbus Movie Release Date, Sumanth Ashwin Columbus Movie Teaser, Sumanth Ashwin Columbus movie stills, Sumanth Ashwin Columbus movie details, Sumanth Ashwin Columbus movie updates, Sumanth Ashwin movies, Sumanth Ashwin movie news, Sumanth Ashwin latest stills, Sumanth Ashwin

Columbus Movie Censor Report: Tollywood actor Sumanth Ashwin Upcoming film Columbus. This film shooting completed. Seerath kapoor, Misthi heroines.

‘కొలంబస్’పై సెన్సార్ బోర్డు ప్రశంసల జల్లు

Posted: 10/20/2015 04:56 PM IST
Columbus movie censor report

సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్టీ ప్రధాన పాత్రల్లో ముస్తాబైన లవ్, ఎంటర్‌ టైనర్‌‌‌గా రూపొందిన ''కొలంబస్'' యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు సెన్సార్‌‌ సభ్యుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇంటిల్లిపాదికీ వినోదాన్ని పంచే సినిమా, కథలో కొత్తదనం ఉందంటూ సెన్సార్ బోర్డు నుండే కాంప్లిమెంట్స్ అందుకున్న ''కొలంబస్'' ఏ‌కెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆర్ సామల దర్శకత్వంలో, అశ్వని కుమార్ సహదేవ్ నిర్మించారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. తమ సినిమాకు సెన్సార్ అభినందలు ఎంతో బలాన్నిచ్చాయన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Video Courtesy : Volga Video

చిత్ర పరిశ్రమలో ఎంతో పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ''కొలంబస్'' తప్పక విజయం సాధిస్తుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మూస చిత్రాల్లా కాకుండా సుమంత్ ఆశ్విన్ కొత్త కథలను ఎంపిక చేసుకుని చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు చిత్రాలను ఎంచుకుని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. ఈ చిత్రం కూడా రొటీన్‌కి భిన్నంగా ప్రేక్షకుడికి ఒ కొత్త అనుభూతితో పాటు మంచి వినోదాన్ని అందిస్తుందని ప్రముఖులు కితాబిచ్చారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్, బిగ్ సీడీను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ ''కొలంబస్''యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెలుగు సినీ అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. దర్శక, నిర్మాతలు కూడా ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. తమ చిత్రాన్ని తప్పక ఆధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మనోహర్ అండ్ రాంబాబు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఇంద్రసేన ఆర్, కోరియోగ్రఫీ: విజయ్, ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, మ్యూజిక్: జితిన్ రోషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జె.బి, సినిమాటోగ్రఫీ: భాస్కర్ సామల, ప్రొడ్యూసర్: అశ్వని కుమార్ సహదేవ్, డైలాగ్స్-డైరెక్షన్: ఆర్.సామల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth Ashwin  Columbus  Censor Report  Teaser  stills  Posters  

Other Articles