Akkineni | Akhil | Nagarjuna | Clarifies | Postponed

Akkineni nagarjuna clarifies on akhil movie delay

Nagarjuna Clarifies on Akhil Movie Postponed, Akhil Movie Release Date Postponed, Akhil Movie Platinum Disc celebrations on 17 October, Akhil Movie Tamil version title, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akkineni Nagarjuna Clarifies on Akhil Movie Delay: Nagarjuna Clarifies on his upcoming film Akhil Release Postpone. VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors. Akhil platinum disc celebrations in Vizag on 17 October.

అఖిల్ వాయిదాపై నాగార్జున క్లారిటీ

Posted: 10/16/2015 06:13 PM IST
Akkineni nagarjuna clarifies on akhil movie delay

అక్కినేని అఖిల్ సయేశా సైగల్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ‘అఖిల్’ సినిమా ఈనెల 22న దసరా కానుకగా విడుదల కానుందని అభిమానులంతా ఎంతో ఆశతో వున్నారు. కానీ తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేసారు. ‘అఖిల్ - పవర్ ఆఫ్ జువా’ అని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ చిత్ర విడుదల వాయిదా గురించి నిర్మాత నితిన్ స్పందిస్తూ... “గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా అఖిల్ సినిమాను అక్టోబర్ 22న విడుదల చేయలేకపోతున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం” అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశంలో చిత్ర దర్శకులు వినాయక్, నాగార్జున పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ... సినిమా మొత్తం పూర్తయ్యింది. చాలా బాగా వచ్చింది. అయితే గ్రాఫిక్స్ విషయంలో కాస్త మరింత బెటర్ మెంట్ కోసం విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. సినిమాలో ఆ సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేసేది. దర్శకుడు వినాయక్ అనుకున్న స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ వారు 75శాతం సూపర్బ్ గా చేసారు. మిగతా 25శాతం కూడా చేసినప్పటికీ... ఇంకా బెటర్ మెంట్ కోసం మరికొంత సమయం కావాలని అడిగారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వారికి సమయం ఇవ్వడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు.

అలాగే... సినిమా విడుదలయిన తర్వాత ఈ వాయిదా విషయాన్ని అభిమానులు మర్చిపోతారు. సినిమా చాలా ఫెంటాస్టిక్ గా వచ్చింది. చాలా నమ్మకంతో చెబుతున్నాను. అఖిల్ డాన్సులు అదరగొట్టేసాడు. అఖిల్ డాన్సులు చూసి నేనే షాక్ అయ్యాను. అంతా బ్రహ్మాండంగా చేసాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అఫిషీయల్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Nagarjuna  Clarifies  Postponed  Sayesha saigal  movie news  

Other Articles