Ram Charan | BruceLee The Fighter | Run Time | Rakul preet singh

Ram charan brucelee the fighter movie run time

BruceLee The Fighter Movie Run Time, Ram Charan BruceLee Movie Censor, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan BruceLee The Fighter Movie Run Time: Mega powerstar Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

మెగాపవర్ స్టార్ ‘బ్రూస్ లీ’ రన్ టైం విశేషాలు

Posted: 10/15/2015 11:40 AM IST
Ram charan brucelee the fighter movie run time

మెగా అభిమానుల సందడి మొదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మెగాపవర్ స్టార్, మెగాస్టార్ లు ఇద్దరూ ఒకే స్ర్కీన్ పై కనిపించి సందడి చేయనున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన తాజా చిత్రం ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ రేపు (అక్టోబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ గెస్ట్ రోల్ లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర రన్ టైం ధూమపానం యాడ్స్ తో కలుపుకొని మొత్తం 146 నిమిషాలు. ఇందులో సెకండ్ హాఫ్ లో చిరంజీవి 5 నిమిషాలు కనిపించి సందడి చేయనున్నారు.

ప్రముఖ కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కృతి కర్బందా, నదియా, అరుణ్ విజయ్ కుమార్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee The Fighter  Run Time  Rakul preet singh  Trailers  

Other Articles