Akkineni | Akhil | Tamil version title

Akhil platinum disc celebrations on 17 october

Akhil Movie Platinum Disc celebrations on 17 October, Akhil Movie Tamil version title, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Platinum Disc Celebrations on 17 October: Akhil Akkineni latest film Akhil. VV Vinayak Direction. Akhil platinum disc celebrations in Vizag on 17 October. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

ఈనెల 17న వైజాగ్ లో అఖిల్ ప్లాటినం డిస్క్ వేడుకలు

Posted: 10/14/2015 04:20 PM IST
Akhil platinum disc celebrations on 17 october

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అఖిల్’. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. ప్రముఖ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సంధర్భంగా ‘అఖిల్’ ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారు.

‘అఖిల్’ ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకలను వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఈనెల 17న సాయంత్రం 6గంటలకు జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొననున్నారు.

తమిళంలో ఈ చిత్రాన్ని ‘సూర్య కవచం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. త్వరలోనే తమిళంలో ఆడియో విడుదల గ్రాండ్ గా చేయనున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న దసరా కానుకగా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Tamil version title  Sayesha saigal  

Other Articles