Ajay Devgn | Violence | BJP rally

Violence at ajay devgn bjp election rally in bihar

Violence at Ajay Devgn BJP rally in Bihar, Violence at Ajay Devgn BJP rally, Ajay Devgn latest news, Ajay Devgn movies, Ajay Devgn movie news, Ajay Devgn latest updates, Ajay Devgn news, Ajay Devgn BJP news, Ajay Devgn

Violence at Ajay Devgn BJP election rally in Bihar: An election rally organised by the Bharatiya Janata Party (BJP) in Bihar. Around 12 people, including some policemen, were injured as police resorted to lathicharge to quell a stone-pelting crowd which grew restive

హీరో లేటుగా వచ్చాడని తుప్పురేగొట్టేసారు!

Posted: 10/14/2015 04:15 PM IST
Violence at ajay devgn bjp election rally in bihar

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు బీహార్ లో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపికి మద్ధతుగా అజయ్ దేవగన్ ప్రచారంలో పాల్గొన్నారు. బీహర్ లోని షరీఫ్ లో బిజెపి ఎన్నికల ప్రచార సభకు అజయ్ దేవగణ్ వస్తారని తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

అజయ్ ను చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే ఉదయం 10 గంటలకు రావాల్సిన అజయ్ మధ్యాహ్నం 1గంట వరకు రాలేదు. దీంతో అభిమానులు సహనం కోల్పోయి బారికేడ్లు దూకి వీరంగం చేసారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీ ఛార్జ్ చేసారు.

దీంతో కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసిరి భీభత్సం సృష్టించారు. ఈ సమయంలోనే అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది బిజేపి నేతలు ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ అక్కడికి వచ్చినప్పటికీ, అక్కడ హెలిక్యాప్టర్ ల్యాండింగ్ కు గ్రౌండ్ లో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ఈ ఘటనలో అభిమానులతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Devgn  Violence  BJP rally  Bihar  news  

Other Articles