Ram Charan | BruceLee The Fighter | Censor Date | Rakul preet singh

Ram charan clarifies on brucelee movie delay

Ram Charan Clarifies on BruceLee Movie Release Date, Ram Charan BruceLee Movie Censor Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan Clarifies on BruceLee Movie Delay: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

‘రుద్రమదేవి’ రాలేదు! ‘బ్రూస్ లీ’ రావడం పక్కా!

Posted: 10/12/2015 11:39 AM IST
Ram charan clarifies on brucelee movie delay

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయదర్శకనిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తో కొనసాగుతోంది. అయితే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శకుడు గుణశేఖర్ ఎంతో కష్టపడ్డారని, కాబట్టి ఈ సినిమా బడ్జెట్ పరంగా కాస్త కోలుకునే వరకు ‘బ్రూస్ లీ’ చిత్రాన్ని వాయిదా వేయాలంటూ చిరంజీవికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓపెన్ లెటర్ రాశారు.

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా ‘రుద్రమదేవి’ సినిమా విషయంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ పై విధంగా స్పందించారు. అయితే ఈ విషయంపై మెగా అభిమానుల్లో ఓ ఉత్కంఠ నెలకొంది. ‘బ్రూస్ లీ’ సినిమా విడుదల అవుతుందో లేదో అని అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ ఈ విషయంపై చెర్రీ ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

రాంచరణ్ స్పందిస్తూ... ‘బ్రూస్ లీ’ చిత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అన్నారు. ‘బాహుబలి’-‘శ్రీమంతుడు’-‘కిక్2’ చిత్రాల నిర్మాతల మధ్య ఓ అండర్ స్టాండింగ్ కుదరడంతో ఆయా సినిమాలు రెండువారాల గ్యాప్ లో విడుదలయ్యాయి. కానీ ‘రుద్రమదేవి’ సినిమా విషయంలో తన దగ్గరకు కానీ, నిర్మాత దానయ్య వద్దకు గానీ ఏ ప్రొడ్యూసర్ రాలేదని రాంచరణ్ చెప్పుకొచ్చాడు. కాబట్టి బ్రూస్ లీ చిత్రం ఈనెల 16న విడుదల అవుతుందని చరణ్ స్పష్టం చేసారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటించారు. కృతి కర్బందా, నదియా ముఖ్య పాత్రలలో నటించగా తమిళ నటుడు అరుణ్ విజయ్ కుమార్ విలన్ పాత్రలో నటించారు. పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో ఘనంగా విడుదల చేయనున్నారు. తమిళంలో ‘బ్రూస్ లీ2’ పేరుతో విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee The Fighter  Censor Date  Rakul preet singh  Trailers  

Other Articles