Rudhramadevi | Suman | comments | Collections | reviews | public talk | news

Suman comments on rudhramadevi movie talk

Actor Suman comments on Rudhramadevi movie, Actor Suman comments on Rudhramadevi, Rudhramadevi movie news, Rudhramadevi movie collections, Rudhramadevi reviews, Rudhramadevi stills, Rudhramadevi latest reports, Rudhramadevi public talk, Rudhramadevi

Suman Comments on Rudhramadevi Movie talk: Telugu actor suman watched latest film Rudhramadevi. Guna sekhar direction. anushka, allu arjun, rana acts in lead roles.

రుద్రమదేవిపై హరిహర దేవుడి ప్రశంసలు

Posted: 10/10/2015 10:35 AM IST
Suman comments on rudhramadevi movie talk

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ‘రుద్రమదేవి’ చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం స్వాగతించవలసిన అంశం. చారిత్రాత్మక చిత్రాలకు ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఈ తరహా చిత్రాలను తీయడానికి మరికొందరు ముందడుగు వేస్తారని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు.

గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ నిర్మాణ విలువలతో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క టైటిల్ పాత్రలో నటించగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలలో నటించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కెథరిన్, నిత్యామీనన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు హరిహర దేవుడు పాత్రలో సుమన్ నటించారు. తాజాగా విడుదలయిన ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ‘రుద్రమదేవి’ చిత్రానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభిస్తుంది. గుణశేఖర్ గారి కృషి, పట్టుదల వలన ఈ విజయం సాధ్యమైంది. చరిత్రపై ఎంతో పరిశోధన చేసి, ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి చిత్రం తెరకెక్కించారు. తెలుగు చిత్రసీమలో ఈ చిత్రం కొత్త అధ్యాయం లిఖించింది. అనుష్క, అల్లు అర్జున్ అద్వితీయంగా నటించారు. నేను హరిహర దేవుడు పాత్రలో నటించాను. కాకతీయ సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే పాత్ర. బాగా నటించావ్ అంటూ పలువురు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. దీనికి కారణం గుణశేఖర్ గారే. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. మంచి చిత్రం ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Suman  comments  Collections  reviews  public talk  news  

Other Articles