Shruti Hassan Has Beat Mahesh Babu And Pawan Kalyan In Twitter Following With 3 Million Followers | Tollywood Controversies

Shruti hassan beat mahesh babu pawan kalyan in twitter following tollywood controversies

Shruti Hassan news, Shruti Hassan twitter, Shruti Hassan photos, Shruti Hassan facebook, Shruti Hassan movies, Shruti Hassan controversies, Shruti Hassan updates, Shruti Hassan latest news, Shruti Hassan gossips, mahesh babu news, mahesh babu gossips, mahesh babu twitter, pawan kalyan news, pawan kalyan twitter, pawan kalyan controversies, trisha krishnan

Shruti Hassan Beat Mahesh Babu Pawan Kalyan In Twitter Following Tollywood Controversies : Shruti Hassan Has Beat Mahesh Babu And Pawan Kalyan In Twitter Following With 3 Million Followers.

పవన్ ని మహేష్ మించితే.. వారిద్దరిని ‘శృతి’మించింది!

Posted: 10/01/2015 03:40 PM IST
Shruti hassan beat mahesh babu pawan kalyan in twitter following tollywood controversies

తెలుగు చిత్రపరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబుల మధ్య నెంబర్ వన్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికీ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ వుండటంతోపాటు వారి చిత్రాలు సరికొత్త రికార్డులు తెరలేపుతుండటంతో.. వారిరువురిలో ఎవరు నెంబర్ వన్ అనేది ఖరారు చేయలేకపోతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ తర్జనభర్జనలో వుంటే.. మరోవైపు శృతిహాసన్ మాత్రం అభిమానుల్ని షాక్ కి గురిచేస్తూ వారిద్దరికంటే మంచిపోయింది. పవన్, మహేష్ బాబులతో పోల్చుకుంటే ప్రస్తుతం శృతిహాసనే మొదటి స్థానంలో దూసుకుపోతోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లెకి వెళ్లాల్సిందే!

ఇండస్ట్రీలో వున్న నటీనటులందరూ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో చేరువగా వుంటారు. ముఖ్యంగా ట్విటర్ లో తమ సినిమాలకు సంబంధించి విశేషాలు పంచుకుంటుంటారు. ఇలాగే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ట్విటర్ లో ఎల్లప్పుడూ యాక్టివ్ గా వుంటున్నారు. అయితే.. ఫాలోయింగ్ లో మాత్రం మహేష్ బాబే మొదటి స్థానంలో వున్నాడు. మహేష్ కి ట్విటర్ లో 15 లక్షల మంది ఫాలోవర్స్ వుంటే.. పవన్ కి కేవలం 6 లక్షలు మంది మాత్రమే వున్నారు. అయితే.. పవన్ ట్విటర్ లోకి ఇటీవలే వచ్చాడు కాబట్టి అతని తక్కువమంది ఫాలోవర్స్ వున్నారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. వీరిద్దరి మధ్య ఈ ఫాలోయింగ్ విషయమై వాదనలు జరుగుతుంటే.. శృతిహాసన్ మాత్రం వీరిద్దరికి మించిపోయింది. నిజానికి సౌత్ ఇండియాలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు క్రేజ్ కాస్త తక్కువ. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేసింది శృతి హాసన్. రెమ్యూనరేషన్, కలెక్షన్ల పరంగా కాకపోయిన తన గ్లామర్తో సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. ట్విట్టర్ ఫాలోవర్స్లో టాప్ హీరోలకు కూడా షాక్ ఇస్తుంది. ట్విట్టర్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్కు 15లక్షల ఫాలోవర్స్ ఉండగా శృతి అంతకు డబుల్ ఫాలోవర్స్ ను సాధిచింది. 30 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది.

స్టార్ వారసురాలిగా వెండితెర మీదకు అడుగుపెట్టిన శృతిహాసన్.. అన్ని రంగాల్లో హవా చూపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో కాస్త తడబడినా, సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. సౌత్తో పాటు నార్త్ లోనూ స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే సూపర్ హిట్స్తో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా అదే జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ‘పులి’ సినిమాతో సౌత్లో సందడి చేస్తున్న శృతిహాసన్ అజిత్ సరసన ‘వేదలం’ సినిమాలోనటిస్తోంది. హిందీలోనూ రెండు సినిమాలలో నటిస్తోందని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Hassan  Pawan kalyan  Mahesh Babu  Twitter  

Other Articles