Rashi Khanna Says That It Is Difficult To Dance With Hero Ram Dance | Shivam Movie Updates | Tollywood Updates

Rashi khanna talks about hero ram dance shivam movie tollywood updates

Rashi Khanna news, Rashi Khanna interview, Rashi Khanna press meet, hero ram news, ram updates, ram movies, ram shivam movie, Rashi Khanna shivam movie, Rashi Khanna with ram, shivam movie release date

Rashi Khanna Talks About Hero Ram Dance Shivam Movie Tollywood Updates : Rashi Khanna Says That It Is Difficult To Dance With Hero Ram Dance.

వామ్మో.. అతడితో వేగడం చాలా కష్టం బాబోయ్!

Posted: 09/29/2015 04:16 PM IST
Rashi khanna talks about hero ram dance shivam movie tollywood updates

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం టాలీవుడ్ లో అడుగుపెట్టిన రాశీఖన్నాకు.. అప్పుడే కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. నిన్నటిదాకా సినిమాలు చేసుకుంటూ సరదాగా గడిపిన ఈ అమ్మడికి ఓ హీరో కాస్త చుక్కలు చూపించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాశీఖన్నాయే చెప్పడం విశేషంగా మారింది. దీంతో ఆ హీరో ఎవరు అని తెలుసుకోవడం కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆ హీరో మరెవ్వరో కాదు.. తాజాగా ఈ అమ్మడితో ‘శివమ్’ సినిమాలో జోడీ కట్టిన రామ్.

టాలీవుడ్ లో యంగ్ ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన రామ్ తాజాగా నటంచిన చిత్రం ‘శివమ్’. ఇందులో రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్, రాశీ ఇద్దరూ యూనిట్ తో కలిసి ప్రమోషన్లో జోరుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే తన చిత్రం గురించి మాట్లాడిన రాశీఖన్నా.. హీరో రామ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. రామ్ ని పొగడ్తలతో ముంచెత్తిన ఆ బ్యూటీఫుల్ భామ.. అతనితో డాన్స్ చేయడం చాలా కష్టమని తన మనసులో మాటను బయటపెట్టింది.

‘‘శివమ్’ సినిమాలోని పాటలను స్వీడన్, నార్వేలలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. రామ్ ఒక మంచి డాన్సర్ కాబట్టి.. కొరియోగ్రాఫర్ చెప్పగానే వెంటనే పట్టేసి చకచకా చేసేవాడు. కానీ.. నేను మాత్రం మూడు, నాలుగుసార్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. డాన్స్ విషయంలో రామ్ మరింత ఎనర్జిటిక్ గా వుంటాడని ఇదివరకే విన్నాను కానీ.. ఈ సినిమాతో ప్రత్యక్ష్యంగా చూశాను. అలాంటి ఎనర్జిటిక్ రామ్ తో కలిసి నేను ఎంతవరకు డాన్స్ చేయగలిగానో తెలీదు కానీ.. ఆడియెన్స్ ఎన్ని మార్క్స్ ఇస్తారో వేచి చూడాలి’ అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi Khanna  Hero Ram  Shivam Movie Updates  

Other Articles