renu desai tweets on item songs at ganesh mandaps in pune

Does ganesh really need item songs to prove bhakti questions renu

renu desai tweets again, actress renu desai tweets on ganesh, actress renu desai tweets on item songs, Does Ganesh really need item songs to prove bhakti.?, Renu desai, Twitter, item songs, Ganesh mandaps, Aadya

actress renu desai tweets again questioning, Does Ganesh really need item songs to prove bhakti.?

నిజంగా.. నీకు ఐటెం సాంగ్స్ కావాలా గణేశా..?

Posted: 09/27/2015 04:10 PM IST
Does ganesh really need item songs to prove bhakti questions renu

సమాజంలో జరుగుతున్న పలు సంఘటనలపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ప్రజలు, అభిమానులతో పంచుకునే నటి రేణు దేశాయ్.. ఈ సారి కూడా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా గణేశ్ మండపాల నిర్వాహకులను ప్రశ్నించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో వినాయక మండపాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో భక్తిని ఇనుమడింప చేసేలా వుండాలని కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా మారుతున్న నిర్వహణా కార్యక్రమాలపై అమె ప్రశ్నించారు. 'వినాయకుడి మీద భక్తిని నిరూపించుకోవడానికి ఐటమ్ సాంగ్స్ అవసరమా?' అంటూ నిలదీశారు

భక్తి.. ఐటమ్ సాంగ్స్.. రెండిటికీ ఏమాత్రం లింక్ లేదు కదా.. మరి ఆమె ఎందుకు ఈ కామెంట్ చేశారు?  అసలు విషయం ఏమిటంటే.. వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి రోడ్డు మీద లౌడ్ స్పీకర్లలో ఐటమ్ సాంగ్స్తో జరిగిన హంగామా గురించి రేణు దేశాయ్ ఈ ట్వీట్ చేశారు. పెద్ద సౌండ్ తో పెట్టిన ఐటెం పాటల కారణంగా తన తనయ ఆద్య నిద్రపోలేక పోయిందంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయిన అనంతరం పిల్లలు అకిరా, ఆద్యలు ప్రస్తుతం తల్లితో కలసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu desai  Twitter  item songs  Ganesh mandaps  Aadya  

Other Articles