Mahesh Babu Bramhotsavam Movie Release Date Postponed | Director Srikanth Addala | PVP Banner Movies

Mahesh babu bramhotsavam movie release date srikanth addala pvp banner

mahesh babu news, mahesh babu updates, bramhotsavam gossips, bramhotsavam updates, mahesh babu bramhotsavam, srikanth addala news, pvp banner movies, samantha ruth prabhu news, kajal agarwal, pranitha

Mahesh Babu Bramhotsavam Movie Release Date Srikanth Addala PVP Banner : Mahesh Babu Bramhotsavam Movie Release Date Postponed To April From Sankranti Due To Other Production Works.

మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే ‘చేదువార్త’

Posted: 09/24/2015 01:33 PM IST
Mahesh babu bramhotsavam movie release date srikanth addala pvp banner

గ్రామాన్ని దత్తత తీసుకునే స్ఫూర్తిదాయక కాన్సెప్ట్ తో తెరకెక్కున ‘శ్రీమంతుడు’ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాదు.. ప్రిన్స మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. దీంతో.. ఈ హీరో నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా సెట్స్ మీదకి వెళ్లని ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుసుకోవడం కోసం అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి.. శ్రీమంతుడు విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అంతగా వెలుగులోకి రాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఆ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా ఎలా వుండబోతోంది? స్టోరీ లైన్ ఏంటి? రిలీజ్ ఎప్పుడు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ సినిమాని ‘సంక్రాంతి’ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని ఏప్రిల్ 7కి మార్చుకున్నట్లు యూనిట్ చెబుతోంది. దీంతో.. సంక్రాంతికే ‘బ్రహ్మోత్సవం’ వస్తుందకున్న అభిమానులు ఏప్రిల్ వరకు వెయిట్ చేయక తప్పదు.

మహేష్ హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం వుంటుందని ఇదివరకే దర్శకనిర్మాతలు వెల్లడించారు. అందరూ కలిసి వుండటంలోనే సంతోషం వుంటుంది.. సంబరం వుంటుంది.. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Bramhotsavam  Srikanth Addala News  PVP  

Other Articles