Varun Tej | Kanche | Audio Launch | Teaser | Audio release date | Trailer | Krish | Stills

Varun tej kanche movie audio launched

Kanche Movie Audio Launch Details, Kanche Movie Nijamenani Song Teaser, Kanche Movie Audio Launch in Hyderabad, Kanche Movie Audio Release Date, Kanche Movie Latest Trailer Release, Kanche Movie First Look Teaser, Kanche Movie First Look, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Varun Tej Kanche Movie Audio Launched: Varun Tej's Kanche Trailer. directed by Krish. produced by Y Rajeev Reddy & J Sai Babu. music by Chirantan Bhat. Starring Varun Tej, Pragya Jaiswal

‘బ్రూస్ లీ’ చేతుల మీదుగా ‘కంచె’ పాటలు విడుదల

Posted: 09/18/2015 10:44 AM IST
Varun tej kanche movie audio launched

వరుణ్ తేజ, ప్రగ్యాజైస్వాల్ జంటగా నటించిన ‘కంచె’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు.

చిరంతాన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ముఖ్య అతిథిగా విచ్చేసారు. బిగ్ సీడిని రాంచరణ్ విడుదల చేయగా, ఆడియో సీడిలను సీతారామశాస్త్రి విడుదల చేసారు. తొలిసీడిని అల్లు అరవింద్ అందుకున్నారు.

ఈ సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలని, ఆ గట్స్ హీరో, దర్శకనిర్మాతలకు వుండటం వల్లే ‘కంచె’ రూపుదిద్దుకుందని, వీరి కృషికి ‘కంచె’ ఘనవిజయం సాధించాలని ఈ వేడుకకు విచ్చేసిన ప్రముఖులు కోరారు. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చునని దర్శకుడు క్రిష్ తెలిజేశారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నికితన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్,పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా ఇతర తారాగణంగా నటిస్తోన్నఈ చిత్రానికి కొరియోగ్రఫీ: బృంద, స్టంట్స్: వెంకట్, డేవిడ్ కుబువా, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్, ఆర్ట్: సాహి సురేష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,సాహిత్యం: సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞాన‌శేఖ‌ర్‌, మ్యూజిక్: చిరంతన్ భట్ ,నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Kanche  Audio Launch  Teaser  Audio release date  Trailer  Krish  Stills  

Other Articles