Trivikram | Nitin | Samantha | A Aa | Anupama Parameswaran | Movie News

Trivikram nitin samantha new movie title confirmed

Trivikram Nitin Movie Title Confirmed, Trivikram New Movie Title Confirmed, Trivikram New Film Title A Aa, Trivikram Nithin film A Aa, Nithin Upcoming film title A Aa, Nithin samantha film title A Aa, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha

Trivikram Nitin Samantha New Movie Title Confirmed: Director Trivikram is going to make a movie under the banner of 'Haarika and Hassine Creations', and he titles the film as "A...Aa" , the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame)

నితిన్, సమంతలతో త్రివిక్రమ్ ‘అ ఆ’

Posted: 09/11/2015 12:29 PM IST
Trivikram nitin samantha new movie title confirmed

త్రివిక్రమ్ నూతన చిత్రం 'అ ఆ'. 'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి' అన్నది ఉప శీర్షిక. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించనున్న చిత్రం పేరు ఇది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయికగా ‘అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం)ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). వరుసగా 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).

Anupama-Parameswaran

సెప్టెంబర్ 3వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nitin  Samantha  A Aa  Anupama Parameswaran  Movie News  

Other Articles