Allu Arjun | Latest Film | first schedule completed

Allu arjun latest film first schedule completed

Allu Arjun Boyapati film first schedule completed, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun movies, Allu Arjun upcoming films, Allu Arjun latest films, Allu Arjun film details, Allu Arjun latest stills, Allu Arjun stills

Allu Arjun Latest Film first schedule completed: stylish star allu arjun upcoming film under Boyapati srinu direction. Allu aravind producer, Thaman music. Rakul preet singh, catherin heroines.

మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సరైనోడు

Posted: 09/01/2015 10:10 AM IST
Allu arjun latest film first schedule completed

‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో వరుసగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హ్యట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. జులై 29న ప్రారంభమైన ఈ షెడ్యూల్ నిరవధికంగా షూటింగ్ జరుపుకుని ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇందులో అల్లు అర్జున్ పై కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమాలో తమిళ నటుడు ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. భారీ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది.

ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Boyapati srinu  Movie News  Rakul preet singh  Stills  

Other Articles

Today on Telugu Wishesh