Superb response for Dynamite promotional tour

Dynamite promotional tour gets superb response

Dynamite promotional tour, Superb response, Manchu Vishnu, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

Manchu Vishnu’s forthcoming film Dynamite is gearing up for a grand release on September 4th.

డైనమైట్ ప్రమోషనల్ పర్యటనకు అద్భుత స్పందన

Posted: 08/30/2015 08:46 PM IST
Dynamite promotional tour gets superb response

మంచువారి నటవారసుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, అటు హీరోగా ఇటు నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు, ప్రస్తుతం ‘డైనమైట్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు.  ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించిన దేవాకట్టా డైనమైట్‌కు దర్శకత్వం వహించారు. తమిళ సూపర్ హిట్ ‘అరిమ నంబి’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషన్ పర్యటనకు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్.. తెలుగు రాష్ట్రాలను చుట్టిరానుంది.

హీరో విష్ణు స్వయంగా ఓ ప్రమోషనల్ టూర్‌లో పాల్గొంటూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఆగష్టు 28న మొదలైన ఈ టూర్ ప్రస్తుతం పలు ప్రాంతాల్లో జోరుగా జరుగుతోంది. నిన్ననే విష్ణు వరంగల్‌లోని వెయ్యి స్థంభాల ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అక్కడి జనాలతో కలిసి డైనమైట్ సినిమా ప్రచారాన్ని చేపట్టారు. ప్రమోషనల్ టూర్‌కు వస్తోన్న రెస్పాన్స్ పట్ల విష్ణు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపారు. అన్నిచోట్లా సినిమా యూనిట్‌కు మంచి అద్బుత స్పందన లభిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.మంచి సస్పెన్స్ ఎలిమెంట్‌తో నడిచే స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమాగా డైనమైట్ కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dynamite promotional tour  Superb response  Manchu Vishnu  

Other Articles

Today on Telugu Wishesh