Baba Sehgal New Song on Pawan Kalyan

Baba sehgal new song on pawan kalyan

Baba Sehgal New Album on Pawan Kalyan, Baba Sehgal New Album, Pawan Kalyan latest news, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan details, Pawan Kalyan stills, Pawan Kalyan latest videos, Pawan Kalyan

Baba Sehgal New Song on Pawan Kalyan: Pop Singer Baba Sehgal upcoming New Album on Powerstar Pawan Kalyan. This album release on Pawan kalyan birthday special, 02 sep.

పవన్ కళ్యాణ్ కోసం బాబా మరో బర్త్ డే సాంగ్

Posted: 08/03/2015 07:20 PM IST
Baba sehgal new song on pawan kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. పవన్ పై అభిమానులు ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తూ వుంటారు. ఇక పవన్ పుట్టినరోజుకు మరింత ఎక్కువ హడావిడి వుంటుందనే విషయం కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఎవరికి తోచిన పద్ధతిలో వారు పవన్ పై అభిమానాన్ని చాటుకుంటారు. ప్రముఖ సింగర్ బాబా సెహగల్ కూడా పవన్ పై వున్న అభిమానాన్ని ఓ పాట రూపంలో చాటుకోబోతున్నాడు.

2012లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ పవర్...’ అంటూ ఓ పాటను తానే రాసి, కంపోజ్ చేసి, పాడి విడుదల చేసాడు. ఆ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా పవన్ కోసం ఓ పాటను రూపొందించాలని ఫిక్స్ అయ్యాడు బాబాసెహగల్. ఈ పాటను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్2)న విడుదల చేయనున్నట్లుగా బాబా సెహగల్ తెలియజేసాడు.

బాబా సెహగల్ ఇప్పటికే తెలుగులోని పలు హిట్ చిత్రాలలోని పాటలను పాడాలరు. ‘జల్సా’, ‘మిర్చి’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు బాబా సెహగల్ తన గాత్రాన్ని అందించాడు. త్వరలోనే విడుదల కానున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Baba Sehgal  New Song  Birthday Gift  Songs  

Other Articles