Producer Sai Korrapati bags Rudhramadevi Krishna Distribution Rights

Producer sai korrapati bags rudhramadevi krishna distribution rights

Sai Korrapati bags Rudhramadevi Krishna Distribution Rights, Sai Korrapati bags Rudhramadevi Distribution Rights, Rudramadevi Latest Poster Released, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Producer Sai Korrapati bags Rudhramadevi Krishna Distribution Rights: Director Gunashekhar Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and others, while Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

సాయికొర్రపాటి దక్కించుకున్న ‘రుద్రమదేవి’ కృష్ణా హక్కులు

Posted: 07/16/2015 09:15 AM IST
Producer sai korrapati bags rudhramadevi krishna distribution rights

అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఇందులో అనుష్క ‘రుద్రమదేవి’ పాత్రలో నటించింది. గోన గన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. రానా, నిత్యామీనన్, కృష్ణంరాజు, కెథరిన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ను అందించాడు.

అయితే తాజాగా ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరిగింది. ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడంతో ‘రుద్రమదేవి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వారాహి చలన చిత్ర సంస్థ అధినేత ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి ‘రుద్రమదేవి’ చిత్ర కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 2.80 కోట్లకు సొంతం చేసుకున్నారు.

భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ బయోపిక్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలను మెల్లిగా ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Korrapati  bags  Rudhramadevi  Distribution Rights  Anushka  

Other Articles