Ram Charan Became doop for Brahmaji

Ram charan became doop for brahmaji

Ram Charan Became doop for Brahmaji, Arun Vijay in Ram Charan Next film, Ram charan movie news, Ram charan movie updates, Ram charan movie stills, Ram charan details, Ram charan shooting news, Ram charan, Ram charan latest stills, Arun Vijay

Ram Charan Became doop for Brahmaji: Actor Brahmaji doing a special role in Ram charan latest film. srinu vaitla direction. Rakul preet singh heroine. Kona Venkat, gopi mohan script writers. thaman music.

బ్రహ్మాజికి డూప్ గా మారిన చరణ్

Posted: 07/15/2015 04:00 PM IST
Ram charan became doop for brahmaji

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో రాంచరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే చరణ్ ప్రస్తుతం నటుడు బ్రహ్మాజీ కోసం డూప్ గా మారినట్లుగా తెలిసింది. ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ ఓ స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. హీరో పాత్ర కాబట్టి పలు యాక్షన్ సన్నివేశాలలో నటించాల్సి వుంటుంది. కాబట్టి.. బ్రహ్మాజీ కనిపించే అన్ని యాక్షన్ సన్నివేశాలలో బ్రహ్మాజీకి డూప్ గా చరణ్ కనిపించనున్నాడు.

ఇటీవలే చరణ్, బ్రహ్మాజీల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్లను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం బ్రహ్మాజీ కూడా తన బాడీని కాస్త బిల్డప్ చేసినట్లుగా తెలిసింది. మరి ఈ సినిమాలో చరణ్, బ్రహ్మాజీల కామెడీ, యాక్షన్ ఎలా వుండనుందో త్వరలోనే తెలియనుంది. చరణ్ అక్క పాత్రలో కృతిఖర్బందా నటిస్తుండగా, నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

ఇందులో చరణ్ కు విలన్ గా ప్రముఖ తమిళ నటుడు అరుణ్ విజయ్ ను ఎంపిక చేసారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనవెంకట్, గోపి మోహన్ కథను సమకూరుస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’, ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Brahmaji  Rakul preet singh  Movie News  

Other Articles