Legendary music director MS Viswanathan passed away

Legendary music director ms viswanathan passed away

MS Viswanathan passes away, MS Viswanathan died, MS Viswanathan death, MS Viswanathan passed away, MS Viswanathan death news, MS Viswanathan died news, MS Viswanathan news, MS Viswanathan dead, MS Viswanathan stills, MS Viswanathan

Legendary music director MS Viswanathan passed away: Legendary music director MS Viswanathan passed away at a Chennai hospital. Viswanathan was admitted to hospital with breathing difficulties. He died on 14 July 2015 at Chennai.

సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ కన్నుమూత

Posted: 07/14/2015 10:20 AM IST
Legendary music director ms viswanathan passed away

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. గతకొద్ది కాలంగా శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న విశ్వనాథన్ ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని మలార్ హాస్పిటల్లో తన తుదిశ్వాసను విడిచారు.

1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని ఇలప్పలిలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు జన్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సుమారు 1200ల సినిమాలకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం అందించారు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ‘లేత మనసులు, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం’ వంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం అందించారు. ఇప్పటికీ కూడా ఈ పాటలు మారుమ్రోగుతూనే వున్నాయి.

అలాంటి ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారనే వార్త సినీ ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. బుధవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరుగుతాయి.


Video Courtesy : Shalimar Telugu Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Viswanathan  Passes away  died  songs  

Other Articles