Ram Charan | Clarifies | Auto johnny | Chiranjeevi | Puri Jagannadh

Ram charan clarifies about auto johnny film rumors

Ram Charan clarifies about Auto Johnny Rumors, Ram Charan clarifies on Auto Johnny Rumors, Ram Charan talks about Auto Johnny, Ram Charan latest news, Ram Charan movies, Ram Charan movie updates, Ram Charan movie details, Ram Charan stills, Ram Charan

Ram Charan clarifies about Auto Johnny film Rumors: Mega Powerstar Ram Charan clarifies about Mega star chiranjeevi 150th film Auto Johnny Rumors. Puri Jagannadh director.

ఆటోజానీ దర్శకుడిపై చెర్రీ క్లారిటీ ఇచ్చేసాడోచ్!

Posted: 07/10/2015 05:48 PM IST
Ram charan clarifies about auto johnny film rumors

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా ప్రాజెక్టు నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ తప్పుకున్నట్లుగా గతకొద్ది రోజులుగా రకరకాలుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 150వ సినిమాను మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘ఆటోజానీ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇటీవలే చిరంజీవికి పూరీ ఆటోజానీ ఫస్ట్ హాఫ్ కథ వినిపించాడు. చిరుకి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ కోసం పూరీ ప్రస్తుతం బిజీగా వున్నాడు.

అయితే ఈ ప్రాజెక్టు నుంచి పూరీ తప్పుకున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై చరణ్ ఓ క్లారిటీ ఇచ్చేసాడు. చిరంజీవి సినిమా నుంచి పూరీ తప్పుకోలేదని, ప్రస్తుతం సెకండ్ హాఫ్ స్టోరీ పనుల్లో పూరీ బిజీగా వున్నాడని చరణ్ తెలిపాడు. అలాగే పవన్ నిర్మాతగా మారి తనతో తీయబోయే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుందని చరణ్ స్పష్టం చేసాడు.

మొత్తానికి తన తండ్రి 150వ సినిమా విషయంపై చరణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక చిరు పుట్టినరోజుకే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడం ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Clarifies  Auto johnny  Chiranjeevi  Puri Jagannadh  

Other Articles