Ticket price hike for Baahubali

Ticket price hike for baahubali

Fans Waiting for Baahubali Movie Tickets, Bahubali Movie Tickets Prices, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Mahesh babu, Srimanthudu, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Ticket price hike for Baahubali: Prabhas Baahubali Movie Tickets Online Booking started. prabhas latest film baahubali will be release on 10 july. Rajamouli director. prabhas, rana, tamannah, anushka acts in lead roles.

బాహుబలి టికెట్ల కోసం ఫ్యాన్స్ రచ్చ రచ్చ

Posted: 07/08/2015 03:16 PM IST
Ticket price hike for baahubali

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాను మొదటిరోజు మొదటి షో కే చూసేయ్యాలని సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు దొరకక అభిమానులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం వారం రోజుల తర్వాతనైనా ఒక్క టికెట్టు దొరికితే చాలు అని అనిపించే విధంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారం రోజుల వరకు కూడా హౌస్ ఫుల్ బుకింగ్ లతో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా టికెట్లకు అభిమానులు పలు సినిమా థియేటర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా ‘బాహుబలి’ సినిమా కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం క్యూ లో నిలబడ్డారు. దాదాపు ఒక కిలో మీటరుకు పైగా టికెట్లకోసం జనాలు క్యూ కట్టేసారు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ కూడా ‘బాహుబలి’ సినిమా టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.

‘బాహుబలి’ టికెట్ల రేట్లు భారీ రేటు పలుకుతున్నాయి. థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసారు. ఒక్కొక్క టికెట్ ధర 2వేల నుంచి మొదలయ్యాయి. ఇక కొన్ని చోట్ల ఒక్కో టికెట్ 5వేల రూపాయలు పలుకుతోంది. బ్లాక్ లో కొనే టికెట్ ధర్ ఇంకెంత వుంటుందో మీరే ఊహించుకోండి.

ఇది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. ఇక మిగతా చోట్ల ఇంకెంత ధర పలుకుంతో తెలియదు. మొత్తానికి ‘బాహుబలి’ విడుదలకు ముందే భీభత్సం సృష్టిస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా జులై 10వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Movie Tickets  Rajamouli  Prabhas  Tickets Prices  Online Booking  

Other Articles