Allu Arjun | Best Actor | 62 Filmfare Award 2014 | Race Gurram

Allu arjun gets best actor 62 filmfare award 2014

Allu Arjun Gets Best Actor 62 Filmfare Award 2014, Allu Arjun Gets Best Actor 62 Filmfare Award 2014 Race Gurram, 62 Filmfare awards 2014 list, 62 Filmfare awards 2014 Nominations List, Filmfare awards 2014 Nominations, Filmfare awards 2014 Nominations details, 62 Filmfare awards Nominations, Filmfare awards 2014 Nominations details, Filmfare awards 2014, Nominations List

Allu Arjun Gets Best Actor 62 Filmfare Award 2014: Stylish star Allu Arjun Gets Best Actor 62 Filmfare Award 2014 for Race Gurram Film. 62 Filmfare awards 2014 Telugu Nominations List. 62 Filmfare awards 2014 latest details, updates, stills, gallery.

‘బెస్ట్ యాక్టర్’గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న బన్నీ

Posted: 06/27/2015 09:21 AM IST
Allu arjun gets best actor 62 filmfare award 2014

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తాజాగా 2014వ సంవత్సరానికి సంబంధించిన 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ప్రతీ ఏటా నిర్వహించే ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం ఈసారి కూడా చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన సినీతారలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హిందీలోని 2014 సినిమాలకు సంబంధించిన ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఇటీవలే ప్రధానం చేసారు. తాజాగా సౌత్ ఇండియాకు చెందిన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన 2014లోని సినిమాలకు అవార్డులను ప్రధానం చేసారు. ఇందులో ఉత్తమ నటుడిగా పలు హీరోలు నామినేట్ అయ్యారు.

BEST ACTOR (MALE)

Allu Arjun- Race Gurram
Mohan Babu- Rowdy
Nagarjuna- Manam
Sharwanand- Run Raja Run
Venkatesh- Drushyam

ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ విడుదలై భారీ విజయం సాధించడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇందులో బన్నీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. తనలోని కొత్త యాంగిల్ ను అభిమానులకు చూపించాడు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా తనలోని కామెడీ టైమింగ్ ను కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా ఇందులో బన్నీ చెప్పిన ‘దే...వుడా’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య ఎక్కడ చూసిన కూడా జనాలలో ఇదే ఊతపదంగా మారిపోయింది. ఇక ఫైట్లు, యాక్టింగ్, డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో బన్నీ చింపేసాడని చెప్పుకోవచ్చు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు శ్యామ్, భోజ్ పురి నటుడు రవికిషన్ ప్రధాన పాత్రలలో నటించారు. బన్నీకి నటుడు రవికిషన్ చాలా గట్టిపోటీనే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో రవికిషన్ బాగా ఆకట్టుకున్నాడు. ఇక కిల్ బిల్ పాండే గా నటించిన బ్రహ్మానందం ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. థమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Best Actor  62 Filmfare Award 2014  Race Gurram  

Other Articles