Finally Allu arjun and boyapati srinu latest project muhurtham fixed | allu arvind | geetha arts

Allu arjun boyapati srinu project muhurtham fix tollywood news

allu arjun, boyapati srinu, allu arvind, geetha arts banner, allu arjun boyapati srinu movie, allu arjun latest projects, allu arjun photos, allu arjun movies, boyapati srinu movies, allu arvind movies, bunny movies

allu arjun boyapati srinu project muhurtham fix tollywood news : Finally Stylish star allu arjun and dynamic director boyapati srinu crazy project muhurtham fixed. This movie produced by allu arvind in geetha arts banner.

ఎట్టకేలకు బన్నీ మూవీకి ముహూర్తం కుదిరిందిగా!

Posted: 06/11/2015 11:54 AM IST
Allu arjun boyapati srinu project muhurtham fix tollywood news

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో ఫ్యామిలీ విజయం అందుకున్న అల్లుఅర్జున్.. తన తదుపరి చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేయనున్న విషయం తెలిసిందే! నిజానికి వీరి కాంబోలో ఓ మూవీ ఎప్పుడో రూపొందుకోవాల్సింది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతుందా..? లేదా..? అనే అనుమానాలు కూడా ఆమధ్య రేకెత్తాయి. అయితే.. బోయపాటి బర్త్ డే సందర్భంగా అల్లువారు ఇచ్చిన భారీ పార్టీతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. కానీ.. వీరి మూవీ ఎప్పుడు మొదలవుతుందోనన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఇప్పుడు దానిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించనున్న బన్నీ-బోయపాటీల కాంబో చిత్రం ఈనెల 12వ తేదీన లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం! ఈ నెలాఖరులోగా చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు యూనిట్ బృందం స్పష్టం చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో బన్నీ ఇద్దరు హీరోయిన్లతో సందడి చేయనున్నాడు. ఆ హీరోయిన్లు ఎవరన్నది త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈసారి ఆలస్యం చేయకుండా నిరవధికంగా షూటింగ్ జరిపేందుకు యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరికొత్తగా కనిపించనున్నాడని చిత్రబృందం తెలుపుతోంది.

దర్శకుడు బోయపాటి శ్రీను కథానాయకుడిని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తాడన్న విషయం తెలిసిందే! ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నింటిలో ప్రతి హీరోను డైనమిక్ గా చూపించాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రంలో కూడా బన్నీని ఆ తరహాలోనే చూపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కువ యాక్షన్ మోతాదుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బన్నీ కూడా బాగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  boyapati srinu  allu arvind  geetha arts  

Other Articles