Sona to play character roles hereafter

I am acting in character role says actress sona

Actress Sona, Sona to play character roles, Tamil, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress, Tamil actors, Tamil movies reviews, Tamil movie reviews, Tamil movie previews, Tamil songs, Tamil music, Tamil top 10, Tamil movie gallery, Tamil mp3, bakthi, Tamil films, latest Tamil movies, sandalwood latest news, Kollywood movies news

Actress Sona to play character roles instead of glamour roles hereafter in movies

చాలు.. ఇకచాలు.. గ్లామర్ పాత్రలు ఇకచాలు..

Posted: 05/31/2015 04:24 PM IST
I am acting in character role says actress sona

సినిమా ఆఫర్ వచ్చిందంటే చాలు ఎగిరి గంతేసి ఛాన్సును సద్వినియోగం చేసుకుంటారు ఎవరైనా. అయితే అందులోనూ గ్లామర్ పాత్రలో నటించాల్సిన అవకాశం వస్తే.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకుంటారు. కాగా నిత్యం ఒకే తరహా పాత్రలువేయడంతో.. బోర్ కోట్టేసి ఇక ఆ పాత్రలలో నటించను అని చెప్పిన వారు ఎందురుంటారు. కానీ ఈ కోలీవుడ్ అందాల అమ్మడు మాత్రం ఇక గ్లామర్ పాత్రలో నటించనని తెగేసి చెబుతోంది. నిత్యం గ్లామర్ పాత్రలలో నటించి నటించి తనకు బోర్ కొట్టేసిందని చెబుతోంది.

దీంతో, ఇకపై క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అంటున్నారు నటి సోనా. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడారు. తమిళంలో ఇదివరకే ఒప్పందమైన చిత్రాలు మినహా వేరే చిత్రాల్లో నటించడం లేదని, ప్రస్తుతం శివప్పు మనిదర్‌గళ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించాలని కోరారని, అన్ని చిత్రాల్లో ఆ విధంగా నటించడం బోర్ కొడుతోందన్నారు. ఇకపై అటువంటి పాత్రల జోలికి వెళ్లనని అన్నారు. మలయాళంలో అమర్ అక్బర్ ఆంతోని సహా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, అక్కడున్న దర్శకులు తనను గ్లామరస్‌గా చూపించడం లేదన్నారు. ఒక్కో చిత్రంలో తన క్యారెక్టర్‌కు ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, నటనను చూపే విధంగా ఈ పాత్రలు ఉన్నట్లు పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sona  Character Roles. glamourous roles  

Other Articles