Salman Khan | Bajrani Bhaijaan Official Teaser

Salman khan bajrani bhaijaan official teaser

Bajrani Bhaijaan Movie First Look Teaser, Bajrani Bhaijaan teaser, Bajrani Bhaijaan first look teaser, Bajrani Bhaijaan latest stills, Bajrani Bhaijaan posters, Bajrani Bhaijaan movie news, Bajrani Bhaijaan movie updates, Bajrani Bhaijaan

Salman Khan Bajrani Bhaijaan Official Teaser: Bollywood star hero salman khan latest movie Bajrani Bhaijaan. This Movie First Look Teaser released yesterday. Kareen kapoor heroine.

ఇక రికార్డులు పగిలిపోవాల్సిందేనా భజ్రంగీ భైజాన్!

Posted: 05/29/2015 11:02 AM IST
Salman khan bajrani bhaijaan official teaser

‘భజ్రంగీ భైజాన్’ టీజర్ విడుదలై దుమ్మురేపుతోంది. సింపుల్ గా కనిపిస్తూనే రచ్చ రచ్చ చేస్తున్నాడు కండల వీరుడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘భజ్రంగీ భైజాన్’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అసలే కోర్టు కేసు నుంచి బయటపడ్డ తర్వాత సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘భజ్రంగీ భైజాన్’ కావడంతో... ఈ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేయడంతో అభిమానుల్లో నూతనుత్సాహం వచ్చింది.

సల్మాన్ ‘భజ్రంగీ భైజాన్’ చిత్రానికి షారుక్ వల్ల మరింత పబ్లిసిటీ ఏర్పడి, సినిమాపై అంచనాలు పెంచేసాయి. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు. ఇందులో సల్మాన్ లుక్ సింప్లీ సూపర్బ్. ఓ చిన్నారికి రక్షణగా వుండే పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ‘బాడీగార్డ్’ చిత్రంతో తర్వాత కరీనా కపూర్ తో సల్మాన్ మరోసారి రొమాన్స్ చేయనున్నాడు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrani Bhaijaan  First look  Teaser  

Other Articles

Today on Telugu Wishesh