AM Rathnam | Bharateeyudu Sequel | Movie news

Am rathnam clarifies on bharateeyudu sequel

AM Rathnam Clarifies on Bharateeyudu, AM Rathnam Clarifies on Bharateeyudu Sequel, Bharateeyudu Sequel, Bharateeyudu Sequel news, Bharateeyudu Sequel updates, Bharateeyudu Sequel details, AM Rathnam

AM Rathnam Clarifies on Bharateeyudu Sequel: Sri Surya Movies Banner Producer AM Rathnam Clarifies on Bharateeyudu Movie Sequel.

ఏదో ఒకరోజు ఖచ్చితంగా భారతీయుడు వస్తాడట!

Posted: 05/25/2015 01:17 PM IST
Am rathnam clarifies on bharateeyudu sequel

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత ఎ.ఎం.రత్నం ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘స్నేహంకోసం’, ‘ఖుషి’, ‘7జి బృందావన కాలని’, ‘బాయ్స్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన బ్యానర్ ‘శ్రీ సూర్య మూవీస్’. కానీ గతకొద్ది కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎ.ఎం.రత్నం దూరంగా వుంటున్నారు.

కేవలం తమిళంలోనే వరుసగా సినిమాలు తీస్తూ బిజీగా వున్నారు. ఇటీవలే తమిళంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ‘ఆరంభం’, ‘ఎన్నై అరిందాల్’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం అజిత్ తో ‘థలా 56’ చిత్రం నిర్మిస్తున్నారు ఎ.ఎం.రత్నం.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ చిత్రాన్ని నిర్మించాలని ఎ.ఎం.రత్నం సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై ‘భారతీయుడు’ చిత్ర దర్శకుడు శంకర్ ను ఎ.ఎం.రత్నం ఇటీవలే కలిసాడట. ‘భారతీయుడు’ సీక్వెల్ తీయాలని తామిద్దరం చర్చించుకున్నామని ఎ.ఎం.రత్నం చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ‘రోబో2’ పనుల్లో శంకర్ బిజీగా వున్నాడని, భవిష్యత్తులో ఎప్పటికైనా ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తామని ఎ.ఎం.రత్నం చెప్పుకొచ్చారు.

మరి అప్పట్లో ఘనవిజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రం ఈ కాలంలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి. అయినా ‘భారతీయుడు’ లాంటి చిత్రాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. కానీ ఏవి కూడా అంతగా విజయం సాధించలేదు. మరి ఈ సీక్వెల్ ఎలా వుండబోతుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AM Rathnam  Bharateeyudu Sequel  Movie news  

Other Articles