nayanthara agrees to do movie with chiru

Nayanthara demands rs 3 crores

nayanthara agrees to do movie with chiru, nayanthara demands rs 3 crores, Nayanthara, demands Rs 3 crores, Chiranjeevi movie, Tollywood, 150th film, Chiranjeevi latest news, Chiranjeevi birthday news, Chiranjeevi movies, Chiranjeevi photos, Chiranjeevi movie collections, Chiranjeevi latest updates, Chiranjeevi movie news,

Actress nayanthara agrees to do movie with megastar chiranjeevi but demands a remumeration of rs 3 crore

నయనా.. మూడు కోకాలు నిజంగా అడిగావా..?

Posted: 05/24/2015 07:07 PM IST
Nayanthara demands rs 3 crores

అచ్చం పక్కింటి అమ్మాయిలా కనబడే దక్షిణాది నటి నయనతార.. ఎంచక్కా మూడు కోకలు అడిగందట. మూడు కోకలేంటి..? ఎందుకు..? అన్న సందేహాలు మీలో తలెత్తుతున్నాయి కదూ. అయితే కోకలంటే తెలుగు కోకలు కాదండి.. హిందీ కోక.. అది సినిమాల్లో మాఫియా డాన్ లు గా నటించే విలన్ లు వాడే బాష. ఇప్పటికైనా అర్థమైందా..? లేద కోక అంటే కోటి రూపాయలు.. అయితే ఒకటి రెండు కాదు ఏకంగా ఒక సినిమాలో నటించడానికి నయనతార మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందన్న పుకార్లు ఫిల్మనగర్, చిత్రపురి పరిసర ప్రాంతాల్లో షికార్లు చేస్తున్నాయి.

తెలుగు చలనచిత్ర రారాజు మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రంలో నటించేందుకు నయన ఈ డిమాండ్ ను చిత్ర నిర్మాతల ముందు పెట్టిందని సమాచారం. నిన్న మొన్నటి వరకు రాజకీయాలలో బిజిగా వున్న చిరు.. తాజాగా తన 150వ చిత్రాన్ని పూర్తి చేసేందుకు అంగీకరించారు. అదేనండీ, తన 150 చిత్రం లో నటించి తన రికార్డును 150 చేర్చందుకు అంగీకరించారు. 2007 తరువాత సినిమాలకు దూరం అయిన చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్ల తరువాత 150వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన కొడుకు యువ నటుడు రామ్ చరణ్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి ఆటోజాని అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాల టాక్. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే నటి నయనతార నటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అనుకున్నదే తడవుగా ఆమెను సంప్రదించగా..  ఓకే చెప్పిన నయన.. మూడు కోకలు అదేనండీ మూడు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందని ప్రచారం హోరెత్తుతోంది. కాగా, మరో హీరోయిన్‌గా నటించే లక్కీచాన్స్‌ను నటి అంజలి కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Rs 3 crores  Chiranjeevi movie  Tollywood  

Other Articles