Tamanna | Avanthika First Look poster | Bahubali

Tamanna as avanthika latest poster released

Tamanna Avanthika‬ First Look, Tamanna as Avanthika‬, Tamanna latest stills, Tamanna posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Tamanna

Tamanna as Avanthika Latest Poster Released: Milky Beauty Tamanna Upcoming telugu movie Bahubali. Tamanna as Avanthika‬ in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

అదరహో అనిపించే అవంతిక అందం... అతిలోకసుందరిని మించినదే!

Posted: 05/18/2015 04:45 PM IST
Tamanna as avanthika latest poster released

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ‘అవంతిక’ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొన్ని నెలల క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసారు. అయితే ఈరోజు విడుదల కానున్న లుక్ పై అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మే 1వ తేది నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా నేడు (మే18) తమన్నా నటించిన అవంతిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ అతిలోక సుందరి తరహాలో వుంటే... తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఇంకా పిచ్చెక్కించేస్తోంది. ఈ లుక్ లో తమన్నా ఓ దేవకన్యలా కనిపిస్తోంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మే 31వ తేదిన ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అలాగే జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

Bahubali Tamanna Avanthika First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tamanna  Avanthika?  First Look poster  Bahubali  

Other Articles