Ram | Shivam | First look posters

Ram shivam movie first look released

Shivam Movie First Look Poster, Shivam Movie First Look, Ram Harikatha First look, Ram latest stills, Ram latest news, Ram movie latest news, Ram latest movie news, Ram movie updates, Ram movies

Ram Shivam Movie First Look Released: Actor Ram Birthday today. Wishing a very happy birthday to u ram. Ram upcoming movies Pandaga chesko, Shivam, Harikatha.

రామ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు రెండు గిఫ్టులు

Posted: 05/15/2015 10:11 AM IST
Ram shivam movie first look released

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా రామ్ కు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్. ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్... ఆ సినిమా భారీ హిట్టును సొంతం చేసుకోవడంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్ నటించిన సినిమాలు ఫ్లాపులు, హిట్టులతో సాగాయి. ఆ తర్వాత రెఢీ, కందిరీగ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ‘పండగచేస్కో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

‘మసాలా’ చిత్రం ఫ్లాప్ అవడంతో రామ్ చాలా గ్యాప్ తీసుకొని వరుస సినిమాలతో దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా మూడు సినిమాలు సెట్స్ పైన వున్నాయి. ‘పండగ చేస్కో’ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రామ్ హీరోగా ‘శివం’, ‘హరికథ’ చిత్రాలు రూపొందుతున్నాయి. శ్రీనివాస రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘శివం’ సినిమా ఒకటి కాగా, మరొకటి కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరికథ’. ఈరోజు రామ్ పుట్టినరోజు సంధర్భంగా ఈ రెండు చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఆ పోస్టర్లు మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  First look  posters  

Other Articles